ఏపీలో పాత వాహనాలపై గ్రీన్‌ట్యాక్స్‌?

ABN , First Publish Date - 2021-11-30T22:35:42+05:30 IST

రాష్ట్రంలోని ప్రజలపై మరో పన్ను బాదుడు

ఏపీలో పాత వాహనాలపై గ్రీన్‌ట్యాక్స్‌?

అమరావతి: రాష్ట్రంలోని ప్రజలపై మరో పన్ను బాదుడు మొదలు కానుంది. ఏపీలో పాత వాహనాలపై గ్రీన్‌ట్యాక్స్‌ విధించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. రవాణా వాహనాలు ఏడేళ్లు దాటితే రూ.4వేలు, పదేళ్లు దాటితే రూ.5వేలు, పన్నెండేళ్లు దాటితే రూ.6వేలు చొప్పున గ్రీన్‌ట్యాక్స్ వసూలు చేస్తారు. మోటార్ సైకిల్ పదిహేనేళ్లు దాటితే రూ.2వేలు, ఇరవై ఏళ్లు దాటితే రూ.5వేలు, కార్లు, జీపులు పదిహేనేళ్లు దాటితే రూ.5వేలు, ఇరవై ఏళ్లు దాటితే రూ.10వేల చొప్పున పన్నులను వేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ ఆమోదం కోసం రవాణాశాఖ అధికారులు ఎదురుచూస్తున్నారు. హరిత పన్నును రద్దు చేయాలని రవాణా రంగం ప్రతినిధులు కోరుతున్నారు.  




Updated Date - 2021-11-30T22:35:42+05:30 IST