తడిసిన ధాన్యం మిల్లింగ్‌కు గ్రీన్‌సిగ్నల్‌!

ABN , First Publish Date - 2022-08-10T10:07:31+05:30 IST

తడిసిన ధాన్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది.

తడిసిన ధాన్యం మిల్లింగ్‌కు గ్రీన్‌సిగ్నల్‌!

7.35 లక్షల టన్నులను బాయిల్డ్‌ మిల్లింగ్‌కు సర్కారు ఆదేశాలు

‘బలవర్ధక బియ్యం’గా మార్చాలని నిర్ణయం


హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): తడిసిన ధాన్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మిల్లుల్లో నిల్వచేసిన ధాన్యంలో పాడైన 4.95 లక్షల టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్‌ మిల్లింగ్‌ చేయాలని, అనంతరం ఫోర్టిఫైడ్‌ రైస్‌ (బలవర్ధక బియ్యం)గా మార్చాలని నిర్ణయించింది. దానికి గతేడాది యాసంగికి చెందిన 2.40 లక్షల టన్నుల ధాన్యం కలిపి మొత్తం 7.35 లక్షల టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్‌ మిల్లింగ్‌ చేయాలని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా 7.35 లక్షల టన్నుల ధాన్యం మిల్లింగ్‌ చేయాలంటూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 

Updated Date - 2022-08-10T10:07:31+05:30 IST