Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 14 Aug 2022 01:17:02 IST

కొత్తకోర్సులకు గ్రీన్‌సిగ్నల్‌

twitter-iconwatsapp-iconfb-icon
కొత్తకోర్సులకు గ్రీన్‌సిగ్నల్‌ఇదే డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం

తెలంగాణ విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులకు శ్రీకారం

ఈ అకాడమిక్‌ ఇయర్‌ నుంచే ప్రారంభం

ఇంజనీరింగ్‌, ఫార్మసీ, ఎంఎస్సీ జియాలాజీ, జూవాలజీ, నానోసైన్స్‌  కోర్సులకు ప్రతిపాదనలు

ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

మరో రెండు రోజుల్లో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు ప్రతిపాదనలు 

కొత్త కోర్సులు వస్తున్నా.. క్యాంపస్‌లో వసతులు మాత్రం అంతంతగానే ..

ఇప్పటికీ విశ్వవిద్యాలయం విస్తరణపై దృష్టిపెట్టని ఉన్నత విద్యాశాఖ 

నిజామాబాద్‌, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో కొత్త కోర్సులను ఈ అకా డమిక్‌ ఇయర్‌ నుంచే ప్రారంభించేందు కు ఏర్పాట్లను చేస్తున్నారు. కొత్త కోర్సుల ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి అందించిన అదికారులు పూర్తి నివేదికను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వవిద్యాలయం పరిధిలో కొత్తగా ఫార్మ సీ, ఇంజనీరింగ్‌, ఉపాధి ఇచ్చే ఎంఎస్సీ కోర్సులతో పాటు సంస్కృతం కోర్సు కూడా ప్రారంబించేందుకు సిద్ధమవుతున్నారు. ఉన్నత విద్యశాఖ అనుమతులు తీసుకుని ప్రారంభించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ ఉద్యోగుల సమస్యలున్నా.. కొత్త కోర్సుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉండడంతో ఈ ఏర్పాట్లను చేస్తున్నారు. కోర్సుల ప్రారంభమేకాకుండా మిగతా జిల్లాలకు విశ్వవిద్యాలయాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. 

మరికొన్ని కోర్సులకు అవకాశం

తెలంగాణ విశ్వవిద్యాలయంలో మరికొన్ని కొత్త కోర్సులను ప్రారంభించేందు కు విశ్వవిద్యాలయం అధికారులు సిద్ధమవుతున్నారు. విశ్వవిద్యాలయం పరిధిలో ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారు లు మరికొన్ని కొత్త కోర్సులను ఈ అకాడమిక్‌ ఇయర్‌ నుంచే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. తుది ప్రతిపాదనలు మరో రెండు రోజుల్లో ప్రభుత్వానికి అం దించేందుకు విశ్వవిద్యాలయం అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. ఇంజినిరింగ్‌ లో కంప్యూటర్‌ సైన్స్‌, మిషన్‌లర్నింగ్‌, సైబర్‌ నెట్‌వర్క్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటలిజె న్స్‌, ఎలక్ర్టానిక్స్‌ కోర్సులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో కొత్తగా బీఫార్మసీ కోర్సును ప్రారంభించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. విశ్వవిద్యాలయంలో ఆరంభం నుంచి ఎంఎస్సీ ఫార్మసిటికల్‌ కెమిస్ర్టీ కోర్సు ఉండడం ఎక్కువగా చదివిన విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్‌ వస్తుండడం వల్ల ఫార్మసీ కోర్సు కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. మొదట ప్రభుత్వ అనుమతి తీసుకుని ఈ కోర్సు ప్రారంభించడంతో పాటు తర్వాత ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతులు తీ సుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కోర్సులే కాకుండా కొత్తగా ఎంఎస్సీ కోర్సులను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఎంఎస్సీలో ఉపాధిని ఇచ్చే జీ యోలజీ కోర్సును ఈ సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఎంఎస్సీ జియాలజీతో పాటు జూవాలజీ, ఎం ఎస్సీ నానోటెక్నాలజీ అనాలాటికల్‌ కెమిస్ర్టీ కో ర్సులను ప్రారంభించేందుకు ఏర్పాట్లను చే స్తున్నారు. ఈ కోర్సులేకాకుండా కొత్తగా ఎంఏ సం స్కృతం కోర్సు ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నా రు. ఈ కోర్సు కా కుండా.. ప్రస్తుతం ఉన్న ఎంఎస్సీ కె మిస్ర్టీలో సీట్లను 30నుంచి 60కి పెంచుతున్నారు. ఈ కోర్సు చదివిన వారి కి మెరుగైన ఉపాధి అవకాశాలు వస్తుడడంతో విశ్వవిద్యాలయం పరిధి లో ఈ సీట్లను పెంచుతున్నారు. ఇవేకాకుండా ఎంసీఏలో కొత్తగ పీహెచ్‌డీ కోర్సు కూడా ప్రవేశపెడుతున్నారు. వీటికి సంబంధించిన తుది ప్రతిపాదనలు రెండు రోజుల్లో ఉన్నత విద్యాశాఖ అధికారులకు అందించేందుకు విశ్వవిద్యాలయం అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కొత్తకోర్సులు ప్రారంభిస్తే.. విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశం ఉండడంతో ఈ అకాడమిక్‌ ఇయర్‌ నుంచే ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

పూర్తిస్థాయిలో భర్తీకాని పోస్టులు

టీయూ ఏర్పాటు చేసి 16 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో పోస్టుల భర్తీ జరగలేదు. విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినపుడు 19 విభాగాలకు 144 టీచింగ్‌ పోస్టులను మంజూరు చేశారు. వీటిలో 85 పోస్టుల ను మాత్రమే భర్తీ చేశారు. విశ్వవిద్యాలయం పరిధిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నుంచి ప్రొఫెసర్‌ వరకు ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు భర్తీ మాత్రం కావడంలేదు. పలుమార్లు నోటిఫికేషన్‌ విశ్వవిద్యాలయం అధికారులు ఇచ్చినా.. ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. విశ్వవిద్యాలయం లో టీచింగ్‌కు ఇబ్బంది ఏర్పడకుండా ఉండేందుకు అకాడమిక్‌ కన్సల్టెంట్‌ లు, కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ల ద్వారా ప్రస్తుతం టీచింగ్‌ కొనసాగిస్తున్నారు. విశ్వవిద్యాలయంలో 19 విభాగాల నుంచి 33 విభాగాలకు కోర్సులు చేరాయి. విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. వారికి అనుగుణంగా పర్మినెంట్‌ పోస్టులను ప్రభుత్వం ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. త్వరలో నోటిపికేషన్‌ ఇచ్చే అవకాశం ఉన్నందున కొత్త కోర్సులు ప్రారంభించినా.. తాత్కాలిక సిబ్బందితో నడిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇవేకాకుండా విశ్వవిద్యాలయం పరిధిలో నాన్‌టీచింగ్‌ పోస్టులు కూడా ఎక్కువగా ఖాళీలు ఉన్నా యి. ఈ ఖాళీల భర్తీని మాత్రం చేయడంలేదు.

టీయూ విస్తరణకు అనుమతి నిరాకరణ

విశ్వవిద్యాలయం పెట్టినప్పటి నుంచి విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తున్నా.. ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు. నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలతో పాటు మెదక్‌ జిల్లాలోని కొన్ని కళాశాలలను విశ్వవిద్యాలయం పరిధికి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించినా.. ఇప్పటి వరకు అమలులోకి నోచుకోలేదు. ప్రస్తుతం ఈ రెండు జిల్లాల పరిధిలో 102 కళాశాలల వరకు ఈ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నాయి. వీటికి సంబంధించిన పరీక్షల నిర్వహణతో పాటు అకాడమిక్‌ క్యాలెండర్‌కు అనుగుణంగా తరగతులు జరిగేవిధంగా చూస్తున్నారు. సీట్ల భర్తీతో పాటు ఇతర అంశాలను పర్యవేక్షిస్తున్నారు. కొత్తగా ఇతర జిల్లాల కళాశాలలను కూడా ఈ విశ్వవిద్యాలయం పరిధిలోకి తెస్తే మరిన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది.

పూర్తికాని శాశ్వత భవననాల నిర్మాణం

విశ్వవిద్యాలయంలో శాశ్వత భవనాలు నిర్మాణం చేపట్టిన ఇంకా పూర్తి స్థాయిలో చేయలేదు. విశ్వవిద్యాలయంలో కోర్సులు పెంచిన విధంగా వాటికి సంబంధించిన భవన నిర్మాణాలను చేపట్టలేదు. కొన్ని భవనాలే నిర్మించడం వల్ల కొత్త కోర్సులో కూడా భవనాలు సరిపోవడంలేదు. విశ్వవిద్యాలయం పరిధిలో వందల ఎకరాలు ఉన్నా.. భవన నిర్మాణాలకు నిధు లు విడుదలకాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న భవనాల్లోనే కోర్సులను నిర్వహిస్తున్న విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు మాత్రం లేవు. విద్యార్థులకు సరిపడా హాస్టళ్లు లేవు. ఉన్న హాస్టళ్లలోనే పరిమితికి మించి విద్యార్థులను ఉంచుతున్నారు. మరిన్ని భవనాలు నిర్మాణం చేస్తే తప్ప విద్యార్థులకు సరిపడా వసతి కల్పించే పరిస్థితి క్యాంపస్‌లో లేదు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు కావాల్సిన ఆడిటోరియం, స్పోర్ట్స్‌కు సంబంధించిన ఏర్పాట్లు లేవు. పరిశోధనకు సంబంధించిన వసతులతో పాటు కెరియర్‌కు సంబంధించిన ఏర్పా ట్లు అంతగా లేవు. ఈ మధ్యనే విశ్వవిద్యాలయంలో పర్యటించిన గవర్నర్‌ కూడా అకాడమిక్‌తో పాటు పరిశోధనపై దృష్టిపెట్టాలని సూచించారు. విశ్వవిద్యాలయంలో మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చే యాలని కోరారు. తనవంతుగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తూనే.. విశ్వవిద్యాల యం అధికారులు విద్యార్థుల కు కావాల్సిన ఏర్పాట్లను చేయాలని చాన్స్‌లర్‌ హోదాలో ఆదేశా లు ఇచ్చారు. వారికి కావాల్సిన వసతులను కల్పించాలని కోరారు. న్యాక్‌ ఏ-గ్రేడ్‌ను విశ్వవిద్యాలయం సాధించేవిధంగా అధ్యాపకులు, విద్యార్థులు కృషి చేయాలని ఆమె కోరారు. మరోదఫా సమీక్షించే అవకాశం ఉండడంతో విశ్వవిద్యాలయం అధికారులు కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ఈ అకాడమిక్‌ ఇయర్‌ నుంచే కొత్త కోర్సులు

: రవీందర్‌గుప్త, వీసీ, తెలంగాణ విశ్వవిద్యాలయం

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈ అకాడమిక్‌ ఇయర్‌ నుంచే కొత్త కోర్సుల ప్రారంభానికి ఏర్పాట్లను చేస్తున్నాం. ఇంజనీరింగ్‌, ఫార్మసీతో పాటు ఎంఎస్సీలో కొత్త కోర్సులను తీసుకువస్తాం. ప్రతిపాదనలను మరో రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపుతాం. విశ్వవిద్యాలయం పరిధిలో ఉపాధి ఇచ్చే కోర్సులను ప్రారంభించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. సిబ్బంది కొరత ఉన్నా.. త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉన్నందున కొత్త కోర్సుల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాం.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.