మక్కల కొనుగోళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2020-10-24T11:20:01+05:30 IST

ఎట్టకేలకు సీఎం కేసీఆర్‌ మొక్కజొన్న కొనుగోలుకు గ్రీన్‌ సిగ్న ల్‌ ఇచ్చారు. నియంత్రిత సాగు విధానం ప్రకారం వానాకాలం సీ జన్‌లో మక్కలను సాగుచేయవద్దని ప్రభుత్వం సూచించింది.

మక్కల కొనుగోళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌

రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లకు సీఎం నిర్ణయం

మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటన

ఫలించిన మక్క రైతుల ఆందోళన

ఇది రైతు విజయమన్న ఎంపీ అర్వింద్‌

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో  2 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నిజామాబాద్‌), కామారెడ్డి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): 

ఎట్టకేలకు సీఎం కేసీఆర్‌ మొక్కజొన్న కొనుగోలుకు గ్రీన్‌ సిగ్న ల్‌ ఇచ్చారు. నియంత్రిత సాగు విధానం ప్రకారం వానాకాలం సీ జన్‌లో మక్కలను సాగుచేయవద్దని ప్రభుత్వం సూచించింది. ఇ కపై రాష్ట్ర ప్రభుత్వం మక్కలను కోనుగోలు చేయదని సీజన్‌కు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. అయిన్నప్పటికీ నిజా మాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో వేల ఎకరాలలోనే రైతులు మొక్క జొన్న పంటను సాగుచేశారు. దీంతో మక్కలను కోనుగోలు చే యాలని అన్నదాతలు తొమ్మిదిరోజులుగా రోడ్డెక్కి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. గురువారం కామారెడ్డి జిల్లాలో మక్కరైతుల ఆందోళన ఉద్రిక్తం కావడంతో రాష్ట్ర ప్రభు త్వం దిగివచ్చి మక్కల కొనుగోళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మార్క్‌ ఫెడ్‌ ద్వారా కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర రూ.1,850 కొను గోలు చేపడతామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో మక్క రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఉమ్మడి జిల్లాలో 2 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి 

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొక్కజొన్నను లక్షల ఎకరాల లోనే అన్నదాతలు సాగుచేస్తుంటారు. నిజామాబాద్‌ జిల్లాలో మొక్కజొన్నను అంతరపంటగా సాగుచేస్తారు. ఈ ఏడాది వానా కాలంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 80 వేల ఎకరాలలోనే మొ క్కజొన్న సాగుకాగా, కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 33 వేల ఎకరాల లో సాగయింది. దీంతో 2 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తు ందని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు మర్క్‌ఫెడ్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మక్కల కొనుగోలు చేపడుతూ వస్తుంది. ఉమ్మడి జి లాల్లో గత ఏడాది 63 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రై తుల నుంచి మక్కలను కోనుగోలు చేశారు. కానీ ఈ యేడు ప్ర భుత్వం మక్కలు కొనుగోలు చేయదని ఇది వరకే ప్రకటించింది. మక్కపంట చేతికి వచ్చి పక్షం రోజులవుతున్నా ప్రభుత్వం కొను గోలు చేయకపోవడంతో అన్నదాతలు ఆందోళన బాట పట్టారు.


ఫలించిన అన్నదాతల ఆందోళనలు

 మక్కలకు మార్కెట్‌లో ధర లేకపోవడంతో రైతులకు గిట్టు బాటు కాదని రాష్ట్ర ప్రభుత్వం ఈ వానాకాలం సీజన్‌ నుంచి ని యంత్రిత పంటసాగు విధానాన్ని అమలు చేసి మక్కలు సాగు చేయవద్దని నిబంధన పెట్టింది. ఇకపై ప్రభు త్వం మక్కలు కొను గోలు చేయదని, ఈ వి షయాన్ని రైతులు గుర్తుంచుకోవాలని తే ల్చిచెప్పింది. అయినప్పటికీ రైతులు ఉ మ్మడి జిల్లాలో లక్షల ఎకరాలలోనే మ క్కలను సాగుచేశారు. మక్కపంట చేతి కి వచ్చి పక్షం రోజులు గడుస్తున్నా ప్ర భుత్వం కోనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయకపోవడంపై రైతులు ఆందో ళనకు గురయ్యారు. మరో వైపు భారీ వర్షాలతో పంట చేన్లలోనే మక్కలు తడిసిపోవడం, మొలకెత్తడంతో పం టకాస్తా వర్షం పాలైందని, దీనికి ప్ర భుత్వమే కారణమంటూ రైతులు రో డ్డెక్కి ఆందోళనలు, నిరసనలను చేప ట్టారు. కామారెడ్డితో పాటు నిజామా బాద్‌, జగిత్యాలు పలు జిల్లా ల్లోనూ మ క్క రైతుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. కామారెడ్డి జిల్లాలో మక్క రైతులు కన్నెర చేసి జాతీయ రహదారిని దిగ్బం ధించడం, కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రికత్తగా మరడంతో మ క్కల కోనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చిం ది. మార్క్‌ఫెడ్‌ ద్వారా కేంద్రం నిర్ణయించిన మద్ద తు ధరకు కొనుగోలు చేపడతామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో రైతులు మక్కల కొనుగోళ్లపై ఆం దోళన, నిరసనలకు ఫలితం దక్కినట్ట యిందని పలువు రు రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు.


ఇది రైతుల విజయం : ఎంపీ అర్వింద్‌

మొక్కజొన్న కొనుగోళ్లపై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయడం రై తుల విజయమని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నా రు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిజామా బాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని కామారెడ్డి, ఆర్మూర్‌, జగిత్యాలలో రై తులు ఆందోళనలు చేయడంతోనే ప్రభుత్వం దిగివచ్చి కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. దీనిని స్వాగతిస్తున్నట్టు ఎంపీ పేర్కొన్నారు.

Updated Date - 2020-10-24T11:20:01+05:30 IST