Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆదర్శం.. Green Marriage.. ప్లాస్టిక్‌ రహిత వివాహ వేడుక

  • స్వచ్ఛ సర్వేక్షణ్‌లో బోడుప్పల్‌ కార్పొరేషన్‌ ప్రోత్సాహకం


హైదరాబాద్ సిటీ/ఉప్పల్‌ : బోడుప్పల్‌ కార్పొరేషన్‌ పారిశుధ్య విభాగంలో ఔట్‌సోర్సింగ్‌ కార్మికురాలిగా పనిచేస్తున్న ఎల్లమ్మ తన కుమార్తె వివాహాన్ని ప్లాస్టిక్‌ రహితంగా చేసి ఆదర్శంగా నిలిచింది. స్వచ్ఛ సర్వే క్షణ్‌లో భాగంగా గ్రీన్‌ మ్యారేజ్‌ గురించి విన్న ఎల్లమ్మ తన కూతురు వివాహ వేడుకను ప్లాస్టిక్‌ రహిత వేడుగా జరపాలనుకుంటున్నట్లు భర్త, బంధువులకు చెప్పింది. అందరూ అంగీకరించడంతో ఆచరణకు పూనుకుంది. బుధవారం బోడుప్పల్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన తన కుమార్తె వివాహంలో పూర్తిగా మోదుగు ఆకులతో చేసిన ఇస్తరాకులు, పోకచెట్టు ఆకులతో చేసిన ప్లేట్లను, పేపర్‌ గ్లాసులను వినియోగించి వివాహ వేడుకకు వచ్చిన వారందరినీ అబ్బుర పరిచింది. బంధువులే కాకుండా వివాహానికి హాజరైన అతిథులు ఆమెను అభినందించారు. బోడుప్పల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, ఇతర అధికారులు సిబ్బంది ఆ వివాహానికి హాజరై గ్రీన్‌ మ్యారేజ్‌ నిర్వహించి ఆదర్శంగా నిలిచిన ఎల్లమ్మను అభినందిస్తూ.. అమెకు ప్రశంసా పత్రాన్ని, ప్రోత్సాహక బహుమతిని అందజేశారు.

Advertisement
Advertisement