హరిత శోభితం

ABN , First Publish Date - 2022-07-02T06:08:30+05:30 IST

హరితహారంలో భాగంగా ఏటా నాటుతున్న మొక్కలు పెరుగుతుండటంతో రహదారులు పచ్చదనాన్ని పరుచుకుంటున్నాయి. పల్లెల్లో, రహదారుల వెంట నాటిన మొక్కలు క్రమంగా ఎదిగి నీడనిస్తున్నాయి. ఈ క్రమంలో 8వ విడత హరితహారానికి ఉమ్మడి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది.

హరిత శోభితం

 8వ విడత ఉమ్మడి జిల్లా లక్ష్యం 1.42లక్షల మొక్కలు 

కొత్తగా రంగంలోకి నీటిపారుదలశాఖ 

 954 ఎకరాల్లో 4.16 లక్షల మొక్కల లక్ష్యం 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): హరితహారంలో భాగంగా ఏటా నాటుతున్న మొక్కలు పెరుగుతుండటంతో రహదారులు పచ్చదనాన్ని పరుచుకుంటున్నాయి. పల్లెల్లో, రహదారుల వెంట నాటిన మొక్కలు క్రమంగా ఎదిగి నీడనిస్తున్నాయి. ఈ క్రమంలో 8వ విడత హరితహారానికి ఉమ్మడి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ప్రస్తుత వర్షాకాలంలో ఉమ్మడి జిల్లాలో 1.42లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు.


ఉమ్మడి జిల్లాలో 33శాతం అటవీ విస్తీర్ణం ఉండాల్సి ఉండగా, కేవలం 3శాతానికే పరిమితమైంది. దీంతో జిల్లాలో ఏటికేడు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతోపాటు కాలుష్యం నియంత్రణ సాధ్యం కావ డం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో అటవీ విస్తీర్ణాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 2016లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా ఏటా మొక్కలు నాటుతుండగా, రెండేళ్లుగా మొక్కలు నాటే లక్ష్యాన్ని అధికారులు పూర్తిచేస్తున్నారు. గతంలో కొన్నిచోట్లే నర్సరీలు ఉండగా, మూడేళ్ల నుంచి ప్రతీ గ్రామానికి ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. జాతీయ, ఉపాధి హామీ పథకం ద్వారా వన నర్సరీలు ఏర్పాటుచేసి మొక్కలు పెంచుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,740 పంచాయతీలు ఉండగా, పంచాయతీకి ఒకటి చొప్పున వన నర్సరీని ఏర్పాటుచేశారు. అదేవిధం గా 19 మునిసిపాలిటీల్లో సైతం వన నర్సరీలు పెంచారు. ఈ వన నర్సరీల్లో 8వ విడత హరితహారం కార్యక్రమానికి చెందిన మొక్కలను సిద్ధం చేశారు. వీటిని ఎప్పటికప్పుడు పంచాయతీ కార్యదర్శులు, గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా, అటవీ, నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యాన, విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించారు. హరితహారం కార్యక్రమాన్ని గత నెల 26వ తేదీన ప్రారంభించగా, ఇప్పటికే నల్లగొండ జిల్లా లో 1.68లక్షల మొక్కలు నాటారు.


నీటిపారుదలశాఖ సైతం

ప్రభుత్వ భూములను కాపాడడంతో పాటు పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. నీటిపారుదలశాఖను ఈసారి హరితహారంలో భాగస్వామ్యం చేసింది. 8వ విడత హరితహారంలో భాగంగా ఈ శాఖ ద్వారా 954 ఎకరాల్లో 4.16లక్షల మొక్కలు నాటాలని ప్రణాళిక రూపొందించింది. సాగు నీటి కాల్వలకు ఇరువైపులా ఉన్న భూములు, కాల్వల నిర్మాణానికి గతంలో రైతుల నుం చి సేకరించిన భూముల్లో మొక్కలు నాటాలని నిర్ణయించిం ది. ఈ మేరకు కాల్వ గట్ల వెంట (లీనియర్‌) 642ఎకరాల్లో 2.06లక్షల మొక్కలు, నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలోని సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ఉన్న క్యాంపు కార్యాలయాలు, స్థలాలు, కాలనీలు, గెస్ట్‌హౌ్‌సలు, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు కింద ఉన్న కార్యాలయాలు (బ్లాక్‌ ఏరియా) మొత్తం 182 ఎకరాల ను గుర్తించి అందులో 88వేల మొక్కలు నాటాలని అధికారు లు నిర్ణయించారు.డిండి ఎత్తిపోతలతో పాటు జిల్లాలోని లిఫ్ట్‌కాల్వలు (ఫాయిల్‌బ్లాక్‌) 130ఎకరాల భూమిని గుర్తించి అందులో 68వేల మొక్కలు నాటాలని నిర్ణయించారు.


పంచాయతీరాజ్‌శాఖకు 60.76లక్షలు

హరితహారంలో మొక్కలు నాటే లక్ష్యాన్ని ప్రభుత్వశాఖల వారీగా అధికారులు ఖరారు చేశారు. అత్యధికంగా జిల్లా పంచాయతీరాజ్‌శాఖ(డీపీవో)కు 60.76లక్షల మొక్కల లక్ష్యా న్ని నిర్దేశించారు. గ్రామీణాభివృద్ధిశాఖ (డీఆర్‌డీవో) శాఖకు 14.09లక్షలు, పశుసంవర్థకశాఖకు 16లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని ఖరారు చేశారు. ప్రతీ ఇంటికి ఆరు మొక్కలచొప్పున అందజేయాలని, కమ్యూనిటీ పల్లెప్రకృతి వనాలు,బృహత్‌ పల్లెప్రకృతి వనాలు,వివిధ సామాజిక వర్గాల వైకుంఠధామాల వద్ద పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటనున్నారు. ఉద్యాన రైతులు, టేకు వనాల లబ్ధిదారులకు జామాయిల్‌, మలబార్‌మీమ్‌ మొక్కలు అందజేయనున్నారు. గ్రామ కంఠాలు, కొత్తగా గుర్తించిన ప్రభుత్వ స్థలాల్లో డీఆర్‌డీవోశాఖ ద్వారా మొక్కలు నాటనున్నారు. పశుసంవర్థకశాఖ ద్వారా కమ్యూనిటీ ప్లాంటేషన్‌, గొర్రెల కాపర్ల ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటనున్నారు.


ఆగస్టు మొదటి వారంలో లక్ష్యాన్ని చేరుకుంటాం : విష్ణువర్ధన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా పంచాయతీ అధికారి

జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని గతనెల 26న ప్రారంభించాం. ఆగ స్టు మొదటి వారంలో లక్ష్యాన్ని పూర్తిచేస్తాం. జిల్లా పంచాయతీశాఖ ఈ కార్యక్రమ లక్ష్యాన్ని సిం హభాగం పూర్తిచేస్తుండగా, ఆ తర్వా త గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, విద్య, అట వీ, మునిసిపాలిటీ, ఎక్సైజ్‌శాఖల ద్వారా లక్ష్యాన్ని పూర్తిచే స్తాం. జిల్లాలో 8వ విడతలో 71.03లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటికే 1.68లక్షల మొక్కలు నా టాం. వర్షాలు ఊపందుకుంటే స్వల్పకాలంలోనే లక్ష్యాన్ని పూర్తిచేస్తాం. అవసరమైన మొక్కలు అందుబాటులో ఉన్నా యి. శాఖల వారీగా లక్ష్యాలు ఖరారు చేసి అవసరమైన మొక్క లు ఆయా శాఖల అధికారులకు అందుబాటులో ఉంచాం.


Updated Date - 2022-07-02T06:08:30+05:30 IST