Green India Challenge ఎంపీ సంతోష్‌ను అభినందించిన అమితాబ్

ABN , First Publish Date - 2021-07-27T16:40:41+05:30 IST

టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌’ కార్యక్రమాన్ని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు.

Green India Challenge ఎంపీ సంతోష్‌ను అభినందించిన అమితాబ్

హైదరాబాద్: టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌’ కార్యక్రమాన్ని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్‌కు హాజరైన ఆయన్ను ఎంపీ సంతోష్ కలిశారు. ఈ సందర్భంగా ఫిల్మ్ సిటీలో ఓ మొక్కను నాటారు అమితాబ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గురించి అమితాబ్‌కు సంతోష్ వివరించారు. ఈ కార్యక్రమంలో సంతోష్‌తో పాటు సినీ నటుడు నాగార్జున కూడా ఉన్నారు.   

Updated Date - 2021-07-27T16:40:41+05:30 IST