1000 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల తొలి కన్సైన్‌మెంట్‌‌ను ఎయిర్‌లిఫ్ట్‌ చేసిన గ్రీన్‌కో గ్రూప్‌

ABN , First Publish Date - 2021-05-17T01:44:20+05:30 IST

కేంద్రంగా కలిగి, భారతదేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సంస్ధలలో ఒకటిగా వెలుగొందుతున్న గ్రీన్‌కో గ్రూప్‌ , అంతర్జాతీయ సరఫరా చైన్‌ నెట్‌వర్క్‌ను వినియోగించుకుని..

1000 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల తొలి కన్సైన్‌మెంట్‌‌ను ఎయిర్‌లిఫ్ట్‌ చేసిన గ్రీన్‌కో గ్రూప్‌

హైదరాబాద్‌: కేంద్రంగా కలిగి, భారతదేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సంస్ధలలో ఒకటిగా వెలుగొందుతున్న గ్రీన్‌కో గ్రూప్‌ , అంతర్జాతీయ సరఫరా చైన్‌ నెట్‌వర్క్‌ను వినియోగించుకుని అత్యంత క్లిష్టమైన ఆక్సిజన్‌ మద్దతు వ్యవస్థలను దేశానికి తీసుకువచ్చింది. అదే సమయంలో అత్యంత క్లిష్టమైన ఆక్సిజన్‌ను వీలైనంత త్వరగా దేశీయంగా పంపిణీ చేయడానికి అత్యుత్తమ ప్రయత్నాలనూ చేస్తోంది. దీనికోసం 5 కార్గో విమానాలను ఏర్పాటు చేసింది. అందులో తొలి కార్గో విమానం నేడు హైదరాబాద్‌లో 200 భారీ మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లతో ల్యాండ్‌ అయింది. ఈ కాన్‌సన్‌ట్రేటర్లు నిమిషానికి 10లీటర్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి. అత్యంత భయంకరమైన కోవిడ్‌–19 మహమ్మారి రెండో వేవ్‌తో పోరాడుతున్న దేశానికి ఇవి తోడ్పాటునందించనున్నాయి.


కాగా.. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ఐటీ, ఎలకాట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, పురపాలక వ్యవహారాలు, నగరాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్‌.. ఈ కాన్‌సన్‌ట్రేటర్లను అందుకున్నారు. దీనికి సంబంధించి గ్రీన్‌కో గ్రూప్‌ ఎండీ అండ్‌ సీఈవో శ్రీ అనిల్‌ చలమలశెట్టి విమానాశ్రయంలోనే మీడియాతో మాట్లాడి అనేక విషయాలను వెల్లడించారు. ఆయనతో పాటు గ్రీన్‌కో కో–ఫౌండర్లు శ్రీ అనిల్‌ చలమలశెట్టి, శ్రీ మహేష్‌ కొల్లి కూడా విమానశ్రయానికి వచ్చారు.

Updated Date - 2021-05-17T01:44:20+05:30 IST