గ్రీన్ ఎనర్జీ... రిలయన్స్ దూకుడు

ABN , First Publish Date - 2021-10-16T00:42:50+05:30 IST

పునరుత్పాదక శక్తిలో గౌతమ్ అదానీ కోటను ఉల్లంఘించడానికి ముఖేష్ అంబా ప్రయత్నిస్తు్న్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే తన ఆలోచనలు, యత్నాలను అమలు చేసే క్రమంలో రిలయన్స్‌లో గ్రీన్ ఎనర్జీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు.

గ్రీన్ ఎనర్జీ... రిలయన్స్ దూకుడు

ముంబై : పునరుత్పాదక శక్తిలో గౌతమ్ అదానీ కోటను ఉల్లంఘించడానికి ముఖేష్ అంబా ప్రయత్నిస్తు్న్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే తన ఆలోచనలు, యత్నాలను అమలు చేసే క్రమంలో రిలయన్స్‌లో గ్రీన్ ఎనర్జీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. జూన్‌లో అంబానీ ఈ గ్రీన్ ఎనర్జీ ప్రణాళికను  ప్రకటించడం, ప్రస్తుతానికి 100 జీడబ్ల్యూ ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాన్ని 2030 నాటికి 450 జీడబ్ల్యూకు పెంచనున్నారు. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టులపై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది.  ఇందుకోసం జర్మనీ కంపెనీ ‘నాక్స్‌వ్యాక్స్‌ జీఎంబీహెచ్‌ లో 2.5 కోట్ల డాలర్ల(సుమారు రూ. 218 కోట్లు) పెట్టుబడి పెడుతోంది.


రిలయన్స్‌ సౌర విద్యుదుత్పత్తికి  అవరమైన సెల్స్‌, మాడ్యూల్స్‌ తయారుచేసే ఆర్‌ఈసీ సోలార్‌ అనే నార్వే కంపెనీని, ఎస్‌పీ గ్రూపునకు చెందిన స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ అనే రెండు కంపెనీలను కొనుగోలు చేసింది. దీనికి తోడు హైడ్రోలైజర్ల తయారీకి అవసరమైన  టెక్నాలజీ కోసం డెన్మార్క్‌కు చెందిన ‘స్టీస్‌డల్‌’ అనే కంపెనీతో లైసెన్సింగ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. జర్మనీ కంపెనీలో పెట్టుబడుల ద్వారా అధునాతన ఫొటోవాల్టిక్‌ సోలార్‌ వాఫర్స్‌ తయారీ పరిజ్ఞానం, డెన్మార్క్‌ కంపెనీతో ఒప్పందం ద్వారా చౌకగా గ్రీన్ హైడ్రోజన్ తయారీ పరిజ్ఞానం రిలయన్స్‌కు అందుబాటులోకి వస్తాయి. 

Updated Date - 2021-10-16T00:42:50+05:30 IST