వాషింగ్టన్: గ్నీన్కార్డు డ్రీమర్ల ఆశలపై అమెరికా సెనేటర్లు నీళ్లు చల్లారు. ‘ప్రయారిటీ డేట్’ పూర్తయ్యి రెండేళ్లు దాటిన దరఖాస్తు దారులు 5వేల డాలర్లు కడితే వారికి గ్రీన్‌కార్డు అందజేయాలంటూ గత వారం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ జ్యుడీషియరీ కమిటీ ఓ బిల్లును సిద్ధం చేసిన విషయం తెలిసిందే. జ్యుడీషియరీ కమిటీ దానికి సుముఖత వ్యక్తం చేసినా.. సెనెట్‌లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 3.5 ట్రిలియన్ డాలర్ల సామాజిక, పర్యావరణ బిల్లులో దాన్ని చేర్చడం సరికాదంటూ చట్టసభ్యుడు మెక్‌డోనఫ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే... ప్రత్యామ్నాయాలను అన్వేషించి, మరోమారు పక్కాగా బిల్లు ప్రవేశపెడుతామని అధికార డెమోక్రాట్ పార్టీ సెనెటర్లు అన్నారు.