Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

US లోని భారతీయులకు తీపి కబురు.. ఇకపై Green card కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు

twitter-iconwatsapp-iconfb-icon

ఆరు నెలల్లోనే గ్రీన్ కార్డు

వాషింగ్టన్‌, మే 17: అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న విదేశీయులకు ముఖ్యంగా ప్రవాస భారతీయులకు ఓ శుభవార్త. శాశ్వత నివాసానికి అవసరమైన గ్రీన్‌ కార్డు జారీ ప్రక్రియ త్వరలో వేగవంతం కానుంది. దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి ఆరు నెలలలోపే ప్రక్రియ అంతా పూర్తి అయ్యే విధంగా విధానపరమైన మార్పులు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు 25 మంది సభ్యులతో కూడిన అమెరికా అధ్యక్షుని సలహాదారుల మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపితే గ్రీన్‌ కార్డు జారీ ప్రక్రియ వేగవంతం కానుంది. ప్రవాస భారతీయుల సంఘం నాయకుడు అజయ్‌ జైన్‌ బుతోరియా గ్రీన్‌ కార్డుల జారీలో జరుగుతున్న జాప్యం అంశాన్ని సలహామండలి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సలహామండలి.. యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్)కు పలు సిఫారసులు చేసింది. 


గ్రీన్‌కార్డు దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూ, జారీ అంశంలో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది.ఇందుకోసం ప్రస్తుతం తాము పాటిస్తున్న విధానాలను, అమల్లో ఉన్న నిబంధనలను, ఇతర అంశాలను పునఃపరిశీలించుకుని అవసరమైన మార్పులు చేసుకోవాలని పేర్కొంది. ఇక, వచ్చే ఆగస్టులోపు అవసరానికి అనుగుణంగా సిబ్బంది సంఖ్యను పెంచుకుని ఇంటర్వ్యూల ప్రక్రియను వేగవంతం చేయాలని నేషనల్‌ వీసా సెంటర్‌(ఎన్‌వీసీ) విభాగానికి సూచించింది. అంతేకాక వర్క్‌పర్మిట్లు, ట్రావెల్‌ డాక్యుమెంట్లు, టెంపరరీ స్టేటస్‌ ఎక్స్‌టెన్షన్స్‌/ సవరణలకు సంబంధించిన వ్యవహారాలను మూడు నెలలోపు పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని యూఎ్‌ససీఐఎ్‌సకు ప్రతిపాదించింది. అంతేకాక ప్రీమియం ప్రొసెసింగ్‌ కింద 2500 డాలర్లు చెల్లించిన వారి దరఖాస్తులపై 45 రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకోవాలని కూడా సిఫారసు చేసింది. కాగా, అమెరికాలో స్థిరపడాలనే కోరికతో గ్రీన్‌ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న విదేశీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. భారత్‌ విషయానికొస్తే పెద్ద సంఖ్యలో ఐటీ నిపుణులు హెచ్‌-1బీ వర్క్‌ వీసాలతో అమెరికా వెళుతుంటారు. 


అయితే, ఏడాదికి అత్యధికంగా 2,26,000 గ్రీన్‌ కార్డులు జారీ చేసే అవకాశం ఉండగా ఇందులో భారత్‌కు ఏడు శాతం కోటా మాత్రమే ఉంది.ఈ నిబంధన వల్ల వేల మంది భారతీయులు గ్రీన్‌కార్డు పొందేందుకు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇక, వేర్వేరు కారణాలతో 2021లో 65,452 గ్రీన్‌ కార్డులను మాత్రమే జారీ చేశారు. ఇంటర్వ్యూల వాయిదా కూడా సాధారణం అయిపోయింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇమ్మిగ్రేషన్‌ నిబంధనల్లో మార్పులు చేసుకోకపోవడమే ఈ సమస్యకు కారణంగా భావిస్తున్నారు. తాజా ప్రతిపాదనలకు అధ్యక్షుడు ఆమోదం లభిస్తే గ్రీన్‌కార్డు జారీ ప్రక్రియ మరింత సులభతరం అయ్యి వేలమంది ప్రవాస భారతీయులు లబ్ధి పొందనున్నారు.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.