కార్యం సాధించాలంటే...

ABN , First Publish Date - 2021-05-21T05:30:00+05:30 IST

ఏసు ప్రభువు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ముందు మోకరిల్లాడు. ‘‘ప్రభువా! నా కుమారుడి మీద మీరు దయ చూపించాలి. అతను మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. నీ శిష్యుల దగ్గరకు అతణ్ణి తీసుకువచ్చాను...

కార్యం సాధించాలంటే...

ఏసు ప్రభువు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ముందు మోకరిల్లాడు. ‘‘ప్రభువా! నా కుమారుడి మీద మీరు దయ చూపించాలి. అతను మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. నీ శిష్యుల దగ్గరకు అతణ్ణి తీసుకువచ్చాను. వారు నా బిడ్డకు నయం చెయ్యలేకపోయారు’’ అని ఆవేదన చెందాడు. 

అప్పుడు ఏసు ‘‘మీది విశ్వాసం లేని, వక్రబుద్ధి ఉన్న తరం. నేను ఎంతకాలం మీతో ఉండగలను? ఎంతకాలం మిమ్మల్ని భరించగలను?’’ అని అంటూ ఆ అబ్బాయిని పిలిచి, అతనిలోని  దుష్ట శక్తిని వెళ్ళగొట్టాడు. అప్పుడు శిష్యులు ‘‘మేం ఆ దుష్ట శక్తిని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం?’’ అని ఏసును ప్రశ్నించారు.

‘‘దానికి కారణం మీలో విశ్వాసం తక్కువగా ఉండడమే. మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నా సరే... కొండనైనా కదిలేలా చేయగలరు’’ అని చెప్పాడు. 

ఏదైనా కార్యాన్ని సాధించాలంటే విశ్వాసం ప్రధానం. సంకల్పం మంచిదైతే, దైవానుగ్రహం తోడవుతుంది. దేనికైనా విశ్వాసం ముఖ్యం. దాన్ని పెంచుకుంటే ఘన కార్యాలు సాధించగలరని ఏసు ఈ సందర్భంలో తన శిష్యులకు బోధించాడు. 


Updated Date - 2021-05-21T05:30:00+05:30 IST