అసభ్యకర పోస్టింగ్స్‌తో మాజీ భర్త వేధింపులు

ABN , First Publish Date - 2021-04-13T05:59:03+05:30 IST

భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్‌ పెడుతూ తనను మాజీ భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని పాత గుంటూరు దుర్గానగర్‌కు చెందిన యువతి అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

అసభ్యకర పోస్టింగ్స్‌తో మాజీ భర్త వేధింపులు

గుంటూరు, ఏప్రిల్‌ 12: భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్‌ పెడుతూ తనను మాజీ భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని పాత గుంటూరు దుర్గానగర్‌కు చెందిన యువతి అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 2019 జులై 9న పొన్నూరు రోడ్డుకు చెందిన షబ్బీర్‌తో వివాహం అయిందన్నారు. పెళ్లి అయినప్పటి నుండి భర్త తనను వేధింపులకు గురి చేస్తుండటంతో  విడాకులు తీసుకున్నామన్నారు. మాజీ భర్త తనకు ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లడటమే కాక తన ఫొటోలతో పాటు తన కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా దుష్ప్రచారం చేస్తున్నాడన్నారు. శుక్రవారం సాయంత్రం తన తల్లితో కలిసి కొత్తపేటలోని ఆసుపత్రికి వెళుతుండగా పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అని తమపై దాడికి పాల్పడ్డారన్నారు. తనను, కుటుంబ సభ్యులను ఆయన నుంచి ప్రాణరక్షణ కల్పించాలని ఆమె వేడుకుంది. 

 

Updated Date - 2021-04-13T05:59:03+05:30 IST