మనసుల్లో సుస్థిరం.. నీ రూపం..

ABN , First Publish Date - 2020-05-29T10:18:01+05:30 IST

యుగ పురుషుడిగా అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ..

మనసుల్లో సుస్థిరం.. నీ రూపం..

ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి

జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున వేడుకలు

హాజరైన టీడీపీ నేతలు, శ్రేణులు

సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ

రెండోరోజూ ఆన్‌లైన్‌లో మహానాడు 

వేడుకలను వీక్షించిన తమ్ముళ్లు


అనంతపురం వైద్యం, మే 28: యుగ పురుషుడిగా అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను తెలుగు తమ్ముళ్లు గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించారు. నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిలో ఎన్టీఆర్‌ చిత్రపటాలు ఏర్పాటు చేసి, పూజలు గావించారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదానం, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఈ వేడుకల్లో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌ రామగిరి మండలంలోని స్వగ్రామం వెంకటాపురంలో పార్టీ జెండా ఎగురవేసి, ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూజలు చేశారు.


ఆయనకు నివాళులర్పించారు. రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుతో పాటు పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కళ్యాణదుర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి పలువురు నేతలతో కలిసి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు అట్టహాసంగా సాగాయి. పెద్దఎత్తున టీడీపీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కదిరిలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు.


గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌కు పలువురు నేతలతో కలిసి నివాళులర్పించారు. గుత్తిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మడకశిరలో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న.. ఎన్టీఆర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శింగనమలలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బండారు శ్రావణిశ్రీ.. శ్రేణులతో కలిసి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. తాడిపత్రిలో మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ జిలాన్‌బాషా ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. పుట్లూరు మండలం ఏ. కొండాపురంలో చంద్రదండు వ్యవస్థాపకుడు ప్రకా్‌షనాయుడు.. స్థానిక నేతలతో కలిసి ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. కంబదూరులో మాజీ జడ్పీ ప్రతిపక్ష నాయకుడు రామ్మోహన్‌ చౌదరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధర్మవరం, ఉరవకొండ, పెనుకొండ నియోజకవర్గాల్లోనూ టీడీపీ శ్రేణులు.. ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు. ఉరవకొండలో అర్చకులు, పాస్టర్లకు సరుకులు పంపిణీ చేశారు.  జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్‌కు తమ్ముళ్లు ఘనంగా నివాళులర్పించారు.


జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసానాయుడు, మాజీ మేయర్‌ మదమంచి స్వరూప ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూజలు నిర్వహించి, నివాళులర్పించారు. ఆర్ట్స్‌ కళాశాల సమీపంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి ప్రభాకర్‌ చౌదరి ఆధ్వర్యంలో పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. జడ్పీ కార్యాలయం వద్ద గల ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రదండు ప్రకా్‌షనాయుడు, న్యాయవాది ఆదెన్న, గౌస్‌మోద్దీన్‌ తదితరులు నివాళులర్పించారు. నేతలు బుగ్గయ్య చౌదరి, మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్‌, కృష్ణకుమార్‌, మణికంఠబాబు, రమాదేవి పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ ఆవరణలో గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గౌస్‌, బాలకృష్ణ అభిమానులు.. ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు.


జిల్లా ఆస్పత్రి వద్ద నిరాశ్రయులకు తెలుగు తమ్ముళ్లు సరిపూటి రమణ, నటే్‌షచౌదరి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు సరిపూటి సూర్యనారాయణ, బాంబే డేయింగ్‌ నాగన్న, తలారి ఆదినారాయణ, రాప్తాడు వెంకటరాముడు, కూచే హరి, సరిపూటి రమణ, రాయల్‌ మురలి, నారాయణస్వామి యాదవ్‌, లింగారెడ్డి, దేవళ్లమురళి, కాకర్ల ఆదినారాయణ, స్వామిదాస్‌, గంగవరం బుజ్జి, విజయశ్రీ, జానకి, సరోజమ్మ, తేజస్విని, వడ్డే వాణి, స్వప్న, కంఠాదేవి, కృష్ణవేణి, బెస్త నారాయణస్వామి పాల్గొన్నారు. 


రెండోరోజూ ఆన్‌లైన్‌లో మహానాడు వేడుకల వీక్షణ

మహానాడు వేడుకలను గురువారం రెండోరోజూ జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు ఆన్‌లైన్‌లో వీక్షించారు. ఆయా నియోజకవర్గాలు, మండల నాయకులు.. శ్రేణులతో కలిసి తమ ఇళ్లల్లోనే అధినేతతోపాటు ఇతర రాష్ట్ర నేతల ప్రసంగాలను వీక్షించారు.

Updated Date - 2020-05-29T10:18:01+05:30 IST