Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 28 Dec 2021 08:34:34 IST

Hyderabadలో Traffic రద్దీ తగ్గించేందుకు కీలక నిర్ణయం.. గ్రేటర్‌ టు ఔటర్‌..!

twitter-iconwatsapp-iconfb-icon

  • లింక్‌ రోడ్ల నిర్మాణం
  • పది మునిసిపాల్టీలు/కార్పొరేషన్ల పరిధిలో ప్రతిపాదన
  • నేడు ఉన్నతస్థాయి సమావేశం
  • నగరంలో సక్సెస్‌
  • మరిన్ని ప్రాంతాలకు విస్తరణ
  • ప్రత్యేక దృష్టి సారించిన పురపాలక శాఖ
  • బ్యాంకు రుణాలతో పనులు
  • ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం లేదంటోన్న అధికారులు


హైదరాబాద్‌ సిటీ : ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ తగ్గించేందుకు అందుబాటులోకి తీసుకువస్తోన్న మిస్సింగ్‌/లింక్‌ రోడ్లను ఔటర్‌ వరకు విస్తరించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. మహానగరం శరవేగంగా విస్తరిస్తుండడం.. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రహదారుల వ్యవస్థను మెరుగుపర్చాలని భావిస్తోంది. శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు ప్రతిపాదించిన ప్రాంతాలతో పాటు.. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఏరియాల్లో రోడ్‌ నెట్‌వర్క్‌ విస్తరణకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఉన్నత స్థాయి ఆదేశాలతో శివారు ప్రాంతాల్లో పలు మునిసిపాల్టీలు, కార్పొరేషన్లు హైదరాబాద్‌ రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఆర్‌డీసీఎల్‌)తో కలిసి కసరత్తు ప్రారంభించాయి. నేడు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు మరోసారి సమావేశం కానున్నారు. ఏ ప్రాంతాల్లో లింక్‌ రోడ్లు అవసరం..? ఏ రహదారులకు అనుసంధానంగా నిర్మించాల్సి ఉంటుంది, వాటి వల్ల ప్రయోజనాలు, ప్రాధాన్యతా క్రమంలో ఏ పనులు మొదట చేపట్టాలి, ఆస్తుల సేకరణ ఆర్థిక భారం, ఆలస్యం కాకుండా పనులు జరిగే మార్గాలు ఎన్ని అన్న దానిపై చర్చించనున్నట్టు ఉన్నతాధికారొకరు తెలిపారు.

Hyderabadలో Traffic రద్దీ తగ్గించేందుకు కీలక నిర్ణయం.. గ్రేటర్‌ టు ఔటర్‌..!

గ్రేటర్‌లో సక్సెస్‌

మహానగరంలో వాహనాల సంఖ్య 65 లక్షలు దాటింది. రహదారులపై ఒత్తిడి పెరగడంతో వంతెనలు, అండర్‌పా్‌సలతోపాటు రహదారుల విస్తరణ, మిస్సింగ్‌/లింక్‌ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్రేటర్‌, శివార్లలో 126.2 కిలోమీటర్ల మేర 135 అనుసంధాన రహదారులను నిర్మించేందుకు ప్రణాళికలు గతంలోనే సిద్ధం చేశారు. 


- మొదటి విడతలో రూ.313 కోట్లతో 44.7 కి.మీల మేర 37 లింక్‌ రోడ్ల నిర్మాణం చేపట్టాలని భావించారు. 16 మార్గాల్లో పనులు పూర్తి కాగా.. ఏడు చోట్ల పురోగతిలో ఉన్నాయి. 14 ఏరియాల్లో ఆస్తుల సేకరణ, ఇతరత్రా కారణాలతో పనులు ప్రారంభం కాలేదని అధికారులు చెబుతున్నారు. జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ రహదారులతో మెయిన్‌ రోడ్లపై ఒత్తిడి గణనీయంగా తగ్గింది. 


- మిస్సింగ్‌/లింక్‌ రోడ్ల ప్రయోగం సక్సెస్‌ కావడంతో మరిన్ని ప్రాంతాల్లో అనుసంధాన రహదారులు నిర్మించాలని నిర్ణయించారు. రెండో విడతలో రూ.70 కోట్లతో 11 లింక్‌ రోడ్లు నిర్మించాలని భావించగా.. కేవలం మూడు మార్గాల్లో మాత్రమే పనులు మొదలయ్యాయి. మూడో విడతగా రూ.491.49 కోట్లతో 29 మార్గాల్లో లింక్‌ రోడ్లు నిర్మించేందుకు కొన్నాళ్ల క్రితం ప్రతిపాదనలు సిద్ధం చేసిన హెచ్‌ఆర్‌డీసీఎల్‌ పురపాలక శాఖకు పంపింది. ఔటర్‌ వరకు ఎంపిక చేసిన మునిసిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలోని రోడ్లతో కలిపి ప్రణాళికలు రూపొందించి పంపాలని పురపాలక శాఖ ఫైల్‌ను వెనక్కి పంపినట్టు తెలిసింది.

Hyderabadలో Traffic రద్దీ తగ్గించేందుకు కీలక నిర్ణయం.. గ్రేటర్‌ టు ఔటర్‌..!

రూ. 1500 కోట్ల రుణం..

హెచ్‌ఆర్‌డీసీఎల్‌ ద్వారా రుణం తీసుకొని అనుసంధాన రహదారులు నిర్మిస్తున్నారు. విడతల వారీగా అవసరాన్ని బట్టి రూ.1500 కోట్లు తీసుకోవాలని నిర్ణయించారు. ఔటర్‌ వరకు లింక్‌ రోడ్లను విస్తరించనున్న నేపథ్యంలో మరింత రుణమూ తీసుకునే అవకాశం లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. రహదారుల నిర్మాణంతో ట్రాఫిక్‌ ఇబ్బందుల పరిష్కారంతోపాటు.. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని, తద్వారా డెవల్‌పమెంట్‌ చార్జీలు వసూలవుతాయంటున్నారు. ఈ రహదారుల నిర్మాణంతో ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం లేదు.. రుణం తీసుకొని.. అభివృద్ధి రుసుము ద్వారా వచ్చే ఆదాయంతో వాయిదాలు చెల్లిస్తామని ఓ అధికారి పేర్కొన్నారు. 


ఈ కార్పొరేషన్లు/మునిసిపాల్టీల్లో...

- బండ్లగూడ జాగీర్‌ 

- ఇబ్రహీంపట్నం 

- కొత్తూరు 

- బడంగ్‌పేట 

- మణికొండ 

- నాగారం 

- దమ్మాయిగూడ 

- జవహర్‌నగర్‌ 

- ఘట్‌కేసర్‌ 

- శంషాబాద్‌

Hyderabadలో Traffic రద్దీ తగ్గించేందుకు కీలక నిర్ణయం.. గ్రేటర్‌ టు ఔటర్‌..!

నగరం నుంచి ఔటర్‌కు...

గ్రేటర్‌ పరిధిలోని ప్రాంతాల నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానంగా లింక్‌ రోడ్లు నిర్మించాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పనపై కసరత్తు మొదలైంది. ప్రధాన రహదారులపై ఒత్తిడి తగ్గడంతోపాటు.. జిల్లాలకు వెళ్లే వాహనదారులు ఔటర్‌ చేరుకోవడం సులువవుతుంది. ఔటర్‌కు అనుసంధానం కోసం 160 రహదారులు నిర్మించాలని క్రెడాయ్‌ సభ్యులు జాబితా ఇచ్చారని, క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలు, అవసరాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఇటీవల ప్రకటించారు. ప్రాధాన్యతా క్రమంలో లింక్‌/మిస్సింగ్‌ రోడ్ల నిర్మాణం చేపట్టాలనీ ఆదేశించారు. దీంతో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఆర్‌డీసీఎల్‌తోపాటు శివార్లలోని 10 మునిపాల్టీల/కార్పొరేషన్ల అధికారులు నేడు సమావేశమవుతున్నారు. సూత్రప్రాయంగా పలు మార్గాలతో జాబితా రూపొందించారని, ఈ రోజు చర్చ అనంతరం స్పష్టత వస్తుందని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారొకరు తెలిపారు. నగరం నుంచి ఔటర్‌కు సులువుగా వెళ్లేందుకు గతంలోనే 33 రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టింది. దశాబ్దం గడిచినా.. 16 మార్గాల్లో మాత్రమే పనులు పూర్తయ్యాయి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.