Abn logo
Sep 17 2020 @ 07:26AM

గ్రేటర్‌ ఎప్పుడూ నెంబర్‌ వన్ : మేయర్‌ బొంతు

హైదరాబాద్‌ : దేశంలో అత్యుత్తమ నివాస యోగ్య నగరం హైదరాబాద్‌ అని, ప్రపంచంలోనూ మెరుగైన నివాస యోగ్య నగరాల్లో గ్రేటర్‌ ఉందని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. తాజాగా నిర్వహించిన సర్వేలో భారత్‌లోని 34 నగరాల్లో హైదరాబాద్‌కు మొదటి స్థానం దక్కడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గతంలోనూ లివబుల్‌, డైనమిక్‌ సిటీగా పలు సర్వేల్లో  నిలిచిందన్నారు. గ్రేటర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ లక్ష్యమని, రూ.5 వేల కోట్లతో పనులు నిర్వహించామని, రాబోయే ఐదేళ్లలో మరో రూ.30-40 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఐటీ, ఇతర పారిశ్రామిక పెట్టుబడులకు నగరం స్వర్గధామంగా మారిందని రామ్మోహన్‌ అభిప్రాయపడ్డారు. 

Advertisement
Advertisement
Advertisement