9న జీసీసీ బడ్జెట్‌

ABN , First Publish Date - 2022-04-06T13:12:57+05:30 IST

కొత్తగా కొలువుదీరిన గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) పాలకవర్గం తొలి సమావేశం ఈ నెల 9వ తేదీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో 2022-23వ ఆర్ధిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశ

9న జీసీసీ బడ్జెట్‌

                            -  ‘సింగార చెన్నై’కే అధిక ప్రాధాన్యం!


ప్యారీస్‌(చెన్నై): కొత్తగా కొలువుదీరిన గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) పాలకవర్గం తొలి సమావేశం ఈ నెల 9వ తేదీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో 2022-23వ ఆర్ధిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.. జీసీసీ మహిళా మేయర్‌గా ప్రియ, డిప్యూటీ మేయర్‌గా మహే్‌షకుమార్‌ గత నెల బాధ్యతలు చేపట్టిన నేపధ్యంలో, జోనల్‌ కమిటీ చైర్మన్లు, స్టాండింగ్‌ కమిటీ చైర్మన్లు గతవారం తమ బాధ్యతలు స్వీకరించా రు. 200 వార్డుల కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం పూర్తిచేయడంతో బడ్జెట్‌   సమావేశంపై గత కొన్ని రోజులుగా చర్చలు జరిగాయి. మేయర్‌, డిప్యూటీ మేయర్‌, జీసీసీ కమిషనర్‌ గగన్‌దీ్‌పసింగ్‌ బేదీ, స్టాండింగ్‌ కమిటీల చైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొని బడ్జెట్‌ సమావేశ తేదీని నిర్ణయించారు. ఆ మేరకు వచ్చే శనివారం ఉదయం 10 గంటలకు జీసీసీ ప్రధాన కార్యాల యం రిప్పన్‌ బిల్డింగ్‌లోని సమావేశ మందిరంలో బడ్జెట్‌ సమావేశం జరుగనుంది. పన్నుల విధింపు స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ జయదాస్‌ ప్రవేశ పెట్టనున్న ఈ బడ్జెట్‌లో కొత్త పథకాల గురించి ప్రకటించే అవకాశముంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో కార్పొరేషన్‌ ప్రాంతాల్లో నెరవేర్చాల్సిన పథకాలు, ప్రస్తుతం జరుగుతున్న పనులు, సింగార చెన్నై పథకం, వర్షాకాలంలో వరద నష్టాన్ని ఎలా అడ్డుకోవాలి తదితర కొత్త ప్రకటనలు ఈ బడ్జెట్‌లో చోటుచేసుకోనున్నాయి. కాగా, జీసీసీ కౌన్సిల్‌ చైర్మన్‌గా రామలింగం, వైస్‌ చైర్మన్‌లుగా ఏఆర్‌పీఎం కామరాజ్‌, రాజగోపాల్‌, విప్‌గా నాగరాజన్‌, కోశాధికారిగా వేళచ్చేరి మణిమారన్‌ తదితరులు తమకు సంబంధించిన పనులను ఈ బడ్జెట్‌ సమావేశంలోనే ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-04-06T13:12:57+05:30 IST