Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంబేద్కర్‌కు ఘన నివాళి

బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ నెలవల సుబ్రహ్మణ్యం

నాయుడుపేట, డిసెంబర్‌ 6 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద ్కర్‌ బాటలో ప్రతి ఒక్కరూ పయనించి ఆయన ఆశయ సాధనకు కృషిచేయాలని చేయాలని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ నెలవల సుబ్రహ్మణ్యం  పిలుపునిచ్చారు. సోమవారం అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక పాలనపై అంబేద్కర్‌కు వినతిపత్రం అందజేశారు. బామ్‌సఫ్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో సరోజిని, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి, అలాగే ఏబీవీపీ కార్యాలయంలో నాయకులు అంబేద్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో  ఎంపీడీవో శివప్రసాద్‌, నాయకులు అశోక్‌రెడ్డి, సుబ్బారావు, రాజేంద్ర, బామ్‌సఫ్‌ నాయకులు మురళీకృష్ణ, భాస్కర్‌, రమేష్‌, ఆదేయ్య పాల్గొన్నారు. 

సూళ్లూరుపేట : సూళ్లూరుపేటలో వివిధ పార్టీలు,  ప్రజా సంఘాల నేతలు స్థానిక బస్టాండ్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ తిరుపతి పార్లమెంట్‌  కార్యదర్శి వేనాటి సతీష్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్‌ల ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మార్కెండేయులు, రవినాయుడు, రాధాకృష్ణ, సురేష్‌నాయుడు, పచ్చా సుబ్రహ్మణ్యం, రాధాకృష్ణ పాల్గొన్నారు.  అంబేద్కర్‌ ధర్మపోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏడీపీఎస్‌ రాష్ట్ర నేత యర్రబోతు సుబ్రహ్మణ్యం, సీనియర్‌ దళిత నేతలు ఆవుల ప్రసాద్‌రావు, తేరే వీరయ్య, చంద్రయ్య, ధనరాజ్‌, గోపీ, చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. మహదేవయ్యనగర్‌లో ఎంఆర్‌పీఎస్‌ నేతలు శ్రీనివాసులు, రాజుబాబు, సురేష్‌ తదితరులు అంబేద్కర్‌కు నివాళులర్పించారు. తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు రవికుమార్‌,  సిబ్బంది, మున్సిపల్‌ చైర్మన్‌ దబ్బల శ్రీమంత్‌రెడ్డి, కమిషనర్‌ నరేంద్రకుమార్‌, ఆర్టీసీ బస్టాండ్‌లో అంబేద్కర్‌కు నివాళులర్పించారు. 

తడ :  స్థానిక తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు రామయ్య, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, భీములవారిపాళెం చెక్‌పోస్టు రవాణాశాఖ కార్యాలయంలో ఎంవీఐ రాంబాబు, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి అంబేద్కర్‌ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. తడకండ్రిగ ప్రాథమిక పాఠశాల వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి వైసీపీ నేత నత్తం శ్రీనివా సులు, దళితనాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సూళ్లూరుపేట : అంబేద్కర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు


Advertisement
Advertisement