ఘనంగా తిరంగా ర్యాలీ!

ABN , First Publish Date - 2022-08-14T04:57:36+05:30 IST

విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందాలని రాయచోటి రూరల్‌ సీఐ లింగప్ప కోరారు. అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శనివారం రాయచోటిటౌన్‌ లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో సంబేపల్లె జెడ్పీహెచ్‌ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

ఘనంగా తిరంగా ర్యాలీ!
రైల్వే కోడూరు: స్వాతంత్య్ర సమర వీరుల వేషధారణలో విద్యార్థులు

సంబేపల్లె, ఆగస్టు 13: విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందాలని రాయచోటి రూరల్‌ సీఐ లింగప్ప కోరారు.  అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శనివారం  రాయచోటిటౌన్‌ లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో సంబేపల్లె జెడ్పీహెచ్‌ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్ర పోరాటాన్ని స్ఫూర్తిగా తీసు కొని మనదేశం మరింత అభివృద్ధి సాధించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీ యూ రాష్ట్ర కమిటీ చైర్మన్‌ శ్రీనివాసరాజు, ప్రధానోపాధ్యాయుడు మడితాటి నరసింహా రెడ్డి, ఎస్‌ఐ ఎస్‌ఎండీ షరీఫ్‌, రాయచోటిటౌన్‌ వ్యవస్థాపక అధ్య క్షుడు లయన్‌ పీఎస్‌ హరినాధ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు లయన్‌ శివారెడ్డి, లయన్‌ హరీష్‌చంద్ర, కోశాధికారి షేక్‌. ఇందాద్‌ అహమ్మద్‌, రత్నంఆచారి, జంగం రెడ్డి, నారాయణరెడ్డి, నాగార్జునాచారి, విజయ్‌కుమార్‌, ఆర్కే కిశోర్‌, రాజ శేఖర్‌ రెడ్డి, చలపతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

రైల్వేకోడూరు: దాదాపు 1000 మంది విద్యార్థులు జాతీయ జెండాతో టోల్గేట్‌ నుంచి పాత బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు.  దేశభక్తి గీతాలు ఆలపించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకులను స్మరించుకుంటూ  నినాదాలు చేశాశారు. ఈ కార్యక్రమంలో విక్టరీ స్కూలు అధినేతలు నరసింహరెడ్డి, రామక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రామాపురం: రామాపురం మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో శనివారం  ఉపాధి సిబ్బంది, విద్యార్థులు, అధ్యాపకులు ర్యాలీ నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి రామకృష్ణుడు, పాఠశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, ఉపాధి సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

పెనగలూరు : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, జూనియర్‌ కళా శాల, పెనగలూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు వేర్వేరుగా తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఆదర్శపాఠశాల, జూనియర్‌ కళా శాల నుంచి మండల కేంద్రంలోని మూడు రోడ్ల కూడలి వరకు  నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. పలువురు విద్యార్థులు భరతమాత, తెలుగు తల్లి, స్వాతంత్య్ర సమర యోధుల వేషాలతో ఆకట్టుకు న్నారు. ముందు గా ఆదర్శ పాఠశాల విద్యార్థులు ర్యాలీ జరపగా అనంతరం ఉన్నత పాఠశాల విద్యార్థులు అదే తరహాలో ర్యాలీ నిర్వహించారు.

లక్కిరెడ్డిపల్లె:  స్థానిక  జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు జగన్మోహిని త్రివర్ణ పతాకం ప్రత్యేకత, స్వాతంత్ర సమర యోధుల గురించి విద్యార్థులకు  వివరించారు. 

సిద్దవటం: సిద్దవటం మండలం బొగ్గిడివారిపల్లె ప్రాఽథ మిక పాఠశాల విద్యార్థులు, హెడ్‌మాస్టర్‌ తులసీధర్‌ ఆధ్వ ర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల కు స్వాతంత్య్ర దినోత్సవంపై అవగాహన కల్పించారు. దేశప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుతున్నామని తెలిపారు. 

వీరబల్లి: ఎస్‌డీకేఆర్‌ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో  పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జడ్పీహైస్కూల్‌ హెచ్‌ఎం గంగాదేవి, వీఆర్‌డీ ఎ స్‌ సురేంద్రారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పీడీ వేణులు పాల్గొన్నారు. 

ఒంటిమిట్ట : ఒంటిమిట్టలో మండల అధికారులు, విద్యార్థులు బస్టాండు నుంచి కోదండ రామాలయం వరకు ర్యాలీ, అనంతరం మానవహారం నిర్వహించారు.  జాతీయ జెండాలను ఎగురవేశారు.  ఎంపీడీవో రంగయ్య, తహసీల్దారు శ్రీనివాసులురెడ్డి, ఎస్‌ఐ సంజీవరాయుడు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

రాయచోటి టౌన్‌: యువతలో దేశభక్తిని నింపాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అరమాటి శివగంగిరెడ్డి అన్నారు. ప్రతిభ జూని యర్‌ కళాశాల విద్యార్థులు, మాజీ సైనికులు, విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ నిర్వహిం చారు.  ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, బస్టాండు సర్కిల్‌ మీదుగా నేతాజీ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.  గాంధీజీ, సుభాష్‌చంద్రబోస్‌, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  నేతాజి సర్కిల్‌ వద్ద మానవహారం నిర్మించారు. ఉమ్మడి జిల్లాల సైనిక సంక్షేమ అధికారి రఘురామయ్య పాల్గొన్నారు

పుల్లంపేట: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమేష్‌నాయు డు, సాయిలోకేష్‌, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు కంభాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో 100 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్‌ ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి, బీజేపీ మండలి అధ్యక్షులు సుబ్బయ్య, రాంప్రసాద్‌, సారధి, తోట నాగేశ్వరయ్య  తదితరులు పాల్గొన్నారు.

చిట్వేలి:  విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. త్రివర్ణపతాకాన్ని ర్యాలీలో ప్రదరించారు. అమరవీరుల వేషాలు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు.   ప్రధాన రహదారి మీదుగా వైఎ్‌స్‌ఆర్‌ విగ్రహం వరకు ర్యా లీ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల యాజమాన్యం, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-14T04:57:36+05:30 IST