అరసవల్లిలో మహా సౌరయాగం

ABN , First Publish Date - 2021-01-26T05:45:26+05:30 IST

ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో సోమవారం మహా సౌరయాగం నిర్వ హించారు. శాస్త్రోక్తంగా యజుర్వేద సవనం దిగ్విజయంగా చేపట్టారు.

అరసవల్లిలో మహా సౌరయాగం
మహా సౌరహోమాన్ని నిర్వహిస్తున్న రుత్వికులు

గుజరాతీపేట : ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో సోమవారం మహా సౌరయాగం నిర్వ హించారు. శాస్త్రోక్తంగా యజుర్వేద సవనం దిగ్విజయంగా చేపట్టారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల నుంచి విచ్చే సిన సుమారు 60 మంది రుత్వికుల ఆధ్వర్యంలో వైనతేయ హోమం, మహాలిం గార్చన, సౌరహోమాలను నిర్వహించారు. ఈ యాగానికి భక్తులెవరిని అనుమతించ లేదు. సాయంత్రం విశాఖకు చెందిన మండపాక శారద బృందం గాత్రకచేరిని నిర్వహించారు. కాగా శ్రీసత్యసాయి సేవాసంఘం ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. కాగా స్వామివారిని విశాఖపట్నం టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీ శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికి... ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం దేవాలయంలో జరుగుతున్న మహాసౌర యాగం వీక్షించారు. ఈవో హరిసూర్యప్రకాష్‌ ఉన్నారు. 

Updated Date - 2021-01-26T05:45:26+05:30 IST