మహోన్నతుడు ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2022-05-25T05:27:24+05:30 IST

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు శత జయంతి, టీడీపీ 40 వసంతాలను ఈనెల 27, 28న జరగబోయే మహానాడులో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్ది చంద్ర మోహన్‌రెడ్డి తెలిపారు.

మహోన్నతుడు ఎన్టీఆర్‌
మాట్లాడుతున్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి

 వైసీపీలో రైతుల పక్షాన నిలిచన మగాడు లేడు

 టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి

నెల్లూరు(వ్యవసాయం), మే 24: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు శత జయంతి, టీడీపీ 40 వసంతాలను ఈనెల 27, 28న జరగబోయే మహానాడులో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్ది చంద్ర మోహన్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులోని ఎన్టీఆర్‌ భవన్‌లో మంగళవారం నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ ఆధ్వర్యంలో రూరల్‌ నియోజకవర్గ మహానాడు సన్నాహక సభ జరిగింది. సోమిరెడ్డి ముఖ్యఅతిఽథిగా మాట్లాడుతూ రేషన్‌కార్డు సృష్టించి పేదవాడికి అండగా నిలిచిన, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహోన్నతుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. భూమి శిస్తు రద్దు చేసి, రైతులకు వడ్డీరాయితీ కల్పించి, పక్కా గృహాల నిర్మాణ రూపకర్తగా నిలిచారని  గుర్తుచేశారు. రైతులకు మద్దతు ధర లేక అల్లాడుతుంటూ రైతుల పక్షాన నిలబడి పోరాడిన ఒక్క మగాడు కూడా వైసీపీలో లేరని ఎద్దేవా చేశారు. అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడుతూ మహానాడును ఆపాలని చూస్తున్నారని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వృథా ప్రయాస అవుతుందన్నారు. గడప గడపకు వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుతుంటే అడుగడుగునా ప్రజలు నేతలను అడ్డుకుంటున్నారన్నారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి అయితే బయట తిట్టొద్దంటూ ఇళ్లల్లోకి వెళ్లి తిట్టించుకుంటున్నారని విమర్శించారు.  మరో ఏడాదిలో ప్రజా పాలన రాబోతోందని ప్రజలకు ధైర్యం చెప్పాలని నాయకులకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, నాయకులు జడ్‌.శివప్రసాద్‌, తాళ్లపాక అనూరాధ, జెన్ని రమణయ్య, బొమ్మి సురేంద్ర, కొండా ప్రవీణ్‌, శైలేంద్రబాబు, మాతంగికృష్ణ, హరికృష్ణ, దయాకర్‌గౌడ్‌, సురేంద్రబాబు, సాయిబాబా, పెంచలనాయుడు, కొమరి విజయ  పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T05:27:24+05:30 IST