మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-08-14T05:13:55+05:30 IST

స్వాతంత్య్రం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన మహానీయులను ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్‌ హరిచందన అన్నారు.

మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలి
నారాయణపేటలో ర్యాలీ ప్రారంభిస్తున్న కలెక్టర్‌ హరిచందన

- కలెక్టర్‌ హరిచందన 

- ఫ్రీడం ర్యాలీ ప్రారంభం 

- పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు

నారాయణపేట టౌన్‌, ఆగస్టు 13: స్వాతంత్య్రం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన మహానీయులను ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్‌ హరిచందన అన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో చేపట్టిన ఫ్రీడం ర్యాలీని కలెక్టర్‌ ప్రారంభించగా ర్యాలీ ఎస్పీ కార్యాలయం మీదుగా పుర వీధుల గుండా మినీ స్టేడియంకు చేరుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రోత్సవాలు ప్రతీ భారతీయుడికి పండుగ లాంటిదన్నారు. దేశం మనది ఈ దేశం కోసం మనమంతా ఏకమౌదామని ఫ్రీడం ర్యాలీని విజయవంతం చేయడం ద్వారా చాటి చెప్పారన్నారు. అనంతరం గాలిలో త్రివర్ణ పతాక రంగులతో కూడిన బెలూన్లను వదిలారు. అదనపు కలెక్టర్‌ పద్మజారాణి, డీఎస్పీ నారాయణ, ఆర్డీవో రాంచందర్‌, పుర చైర్‌పర్సన్‌ అనసూ య పాల్గొన్నారు.

మక్తల్‌ రూరల్‌  : ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మండలంలోని మంతన్‌గోడ్‌, అనుగొండ, కర్నీ, నర్సిరెడ్డిపల్లి, పంచలింగాల, సంగంబండ గ్రామాల్లో శనివారం తిరంగా ర్యాలీ, బెలూన్స్‌ ర్యాలీ నిర్వహించారు. మంతన్‌గోడ్‌లో ఉన్నత పాఠశాల నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు చేపట్టిన ర్యాలీలో జడ్పీ చైర్‌ పర్సన్‌ వనజ పాల్గొ ని మాట్లాడారు.  ఎంపీడీవో శ్రీధర్‌, సర్పంచులు రమేష్‌, అనిత, ఉప సర్పంచు కేశవ రెడ్డి పాల్గొన్నారు.

నారాయణపేట రూరల్‌ : ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా మండలంలోని సింగారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శనివారం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులచే మువ్వన్నెల జెండాను చేతపట్టి ర్యాలీ నిర్వహించారు. మండలంలోని బోయిన్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పేట ఎంపీడీవో సందీప్‌కుమార్‌, హెచ్‌ఎంలు జయప్రకాశ్‌, బనదయ్య, ఎంపీవో రాజు పాల్గొన్నారు. 

కృష్ణ : ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో శనివారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎస్‌ఐ విజయభాస్కర్‌, హెచ్‌ఎం నిజముద్దిన్‌ పాల్గొన్నారు.

మాగనూరు : స్వాతంత్య్ర భారత వ జ్రోత్సవాల సందర్భంగా మండలంలో ఓబు లాపూర్‌, నేడేడుగం, వర్కూరు, మాగనూరు గ్రామాల్లో శనివారం బెలూన్స్‌ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఇంటింటిపై త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. మండల ప్రత్యేకాధికారి రాణా ప్రతాప్‌, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి సర్పంచులు రాజు, అశోక్‌గౌడ్‌, ఎంపీపీ శ్యామలమ్మ, జడ్పీటీసీ సభ్యుడు వెంకటయ్య, ఎంపీటీసీ సభ్యుడు ఎల్లారెడ్డి, మాజీ సర్పంచు విద్యా సాగర్‌, ఉప సర్పంచు సుధ పాల్గొన్నారు.

 నర్వ : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం, ఆంబేడ్కర్‌ చౌరస్తా వరకు విద్యార్థుల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్‌ సంధ్య, వైస్‌ ఎంపీపీ వీణావతి, ఎంపీపీ జయరాములు శెట్టి, జడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి పాల్గొన్నారు.

మద్దూర్‌ : వజ్రోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని మద్దూర్‌లో వివిధ పాఠశాలల విద్యార్థులు జెండాలతో ర్యాలీ నిర్వహించారు. కొత్త పాఠశాల నుంచి సాగిన ర్యాలీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరింది. ఎంపీడీవో విజయలక్ష్మి, సర్పంచ్‌ అరుణ, ఎంపీటీసీ  వెంకటయ్య పాల్గొన్నారు.

మరికల్‌ : వజ్రోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సురేఖరెడ్డి, ఎంపీడీవో యశోదమ్మ ఆధ్వర్యంలో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాతో ఇందిరా గాంధీ చౌరస్తా నుంచి పెట్రోల్‌బంక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.  బుడ్డగానితండాలో ఉప సర్పంచ్‌ భాస్కర్‌నా యక్‌ ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలు ఘ నంగా నిర్వహించారు. వైస్‌ ఎంపీపీ రవికుమార్‌, ఎంపీటీసీ సభ్యురాలు సుజాత, గోపా ల్‌, ఉప సర్పంచ్‌ శివకుమార్‌ పాల్గొన్నారు. 

ఊట్కూర్‌ : వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. శనివారం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఊట్కూరులో సర్పంచ్‌ సూర్యప్రకాష్‌రెడ్డి ర్యాలీని ప్రారంభించగా, నిడుగుర్తిలో సర్పంచ్‌ యశోదమ్మ, ఎంపీటీసీ సభ్యుడు వీరరాఘవరెడ్డి ర్యాలీలి ప్రా రంభించారు. చిన్నపొర్లలో ఎంపీటీసీ సభ్యుడు రవిప్రసాద్‌రెడ్డి, సర్పంచ్‌ రవీందర్‌రెడ్డి ప్రారంభించి జెండాలను ఎగరవేశారు. చిన్నపొర్ల అంగన్‌వాడీలో వజ్రోత్సవ వేడుకలను నిర్వహించారు. ఎడవెల్లిలో జెండాలను పంపిణీ చేశారు. ఎంపీడీవో కాళప్ప, ఎస్‌ఐ రాములు, ఎంపీటీసీ సభ్యుడు హన్మంతు, ఉపర్పంచ్‌ ఇబాదుర్‌రెహమాన్‌, హెచ్‌ఎంలు లక్ష్మారెడ్డి, జగన్నాథ్‌రావు, హిదాయత్‌ , మాజీ ఎంపీటీసీ సభ్యుడు కృష్ణార్జున్‌రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్లు నర్సిములు, మఖ్బుల్‌ ఖాన్‌ పాల్గొన్నారు.

కోస్గి : వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం కోస్గి మునిసిపాలిటీలో శివాజీ చౌక్‌ మీదుగా విద్యార్థులతో ప్రజాప్రతినిధులు ఫ్రీడం ర్యాలీ నిర్వహించారు. మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ శిరీష స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూ ర్తిని భావితరాలకు బోధించేందుకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

దామరగిద్ద :  మండల కేంద్రంలో మండల డీలర్ల ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ ఆనందు మాట్లాడుతూ ప్రతీ ఇంటిపై జెండాను ఎగురవేయాలన్నారు. ఎంపీటీసీ సభ్యుడు ఈశ్వరమ్మ గ్రామంలో జెండాలను పంపినీ చేశారు. రవి, వెంకటేష్‌, నితీన్‌, సంజీవ్‌కుమార్‌ ఉన్నారు. 








Updated Date - 2022-08-14T05:13:55+05:30 IST