Jul 30 2021 @ 08:02AM

పవన్ కళ్యాణ్ - రానాలతో పని చేయడం గొప్ప అవకాశం: రవి కే చంద్రన్

పవన్ కళ్యాణ్ - రానాలతో పని చేయడం గొప్ప అవకాశం అని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ అన్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఏకే తెలుగు రీమేక్ నిర్మిస్తున్న సంగతి తెలిసందే. ఈ చిత్రానికి మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్‌లో ప్రొడక్షన్ నంబర్ 12గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా రవి కే చంద్రన్‌ను చిత్రబృందం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా మేకర్స్ తాజాగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ నేపథ్యంలో రవి కే చంద్రన్ స్పందించారు. "భీమ్లా నాయక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటిలతో పని చేయడం అద్భుత అవకాశం అని. పవన్ స్టైల్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌ను డిఫెరెంట్ ఫ్రేమ్స్ లో చూపిస్తా".. ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా ఈ సినిమా 2022 సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.