ప్రపంచ రెజ్లింగ్ స్టార్ Great Khali ఆప్‌లో చేరుతున్నారా?ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భేటీ

ABN , First Publish Date - 2021-11-19T13:21:59+05:30 IST

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) మాజీ స్టార్ ది గ్రేట్ ఖలీగా పేరొందిన దలీప్ సింగ్ రాణా ఆమ్ ఆద్మీపార్టీలో చేరుతున్నారా?...

ప్రపంచ రెజ్లింగ్ స్టార్ Great Khali ఆప్‌లో చేరుతున్నారా?ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భేటీ

న్యూఢిల్లీ: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) మాజీ స్టార్  ది గ్రేట్ ఖలీగా పేరొందిన దలీప్ సింగ్ రాణా ఆమ్ ఆద్మీపార్టీలో చేరుతున్నారా? అంటే అవునంటున్నారు రాజకీయ పరిశీలకులు...వచ్చే ఏడాది పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రేట్ ఖలీ తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. దీంతో గ్రేట్ ఖలీ ఆప్ లో చేరుతున్నారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రేట్ ఖలీ ప్రశంసించారు. భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు తాను మద్ధతు ఇస్తానని గ్రేట్ ఖలీ చెప్పారు. గ్రేట్ ఖలీ వెంట ఢిల్లీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ ఉన్నారు.


 ‘‘ఈ రోజు నేను భారతదేశానికి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చిన రెజ్లర్ ది గ్రేట్ ఖలీని కలిశాను. గ్రేట్ ఖలీ ఢిల్లీలో మా ప్రభుత్వం చేపట్టిన విద్యుత్, నీరు, పాఠశాల ,ఆసుపత్రుల రంగంలో చేసిన పనిని ఇష్టపడ్డారు’’ అని సీఎం కేజ్రీవాల్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో తెలిపారు.


Updated Date - 2021-11-19T13:21:59+05:30 IST