సాధిక్‌ను సన్మానిస్తున్న రాములు
షాద్‌నగర్‌అర్బన్, జూలై 2: తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సయ్యద్ సాధిక్‌ను శనివారం ఘనంగా సన్మానించారు. జనరల్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ రాములుతో పాటు పలువురు సాధిక్‌ను సన్మానించి అభినందనలు తెలిపారు. ప్రతిలారీకి బీమా కల్పించే విధంగా లారీఓనర్లలో చైతన్యం తీసుకురావాలని రాములు కోరారు.