ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

ABN , First Publish Date - 2020-03-30T10:06:55+05:30 IST

టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం గుంటూరులో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

గుంటూరు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):  టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. లాక్‌డౌన్‌ కారణంగా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు పార్టీ నాయకులు తమ ఇళ్ల వద్దనే ఆవిర్భావ దినోత్సవాన్ని జరిపారు. పార్టీ సీనియర్‌ నేత మన్నవ సుబ్బారావు తన నివాసంలో కార్యకర్తలతో కలిసి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


కార్యక్రమంలో నాయకులు లాల్‌వజీర్‌, ముత్తినేని రాజేష్‌, కట్టా శ్రీనివాసరావు, కుర్రా శంకరరావు తదితరులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మహ్మద్‌ నసీర్‌ తన ఇంటిపై కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర(నానీ) లక్ష్మీపురంలోని తన కార్యాలయంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కనపర్తి శ్రీనివాస్‌, కసుకుర్తి హనుమంతరావు, షేక్‌ బాజీ తదితరులు పాల్గొన్నారు. బ్రాడీపేట 6/17లో సీనియర్‌ నాయకుడు ముప్పాళ్ల మురళీకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ జెండా ఎగురవేశారు.  మైనార్టీ నేత ఎండీ హిదాయత్‌  ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.    

Updated Date - 2020-03-30T10:06:55+05:30 IST