వీల్‌చైర్‌పై పెద్ద సాహసమే!

ABN , First Publish Date - 2020-06-30T22:11:16+05:30 IST

వెల్దుర్తి హైవేలో ఉండే ఉత్తరప్రదేశ్‌కు చెందిన హసీనా(40)కు ఐదుగురు సంతానం.

వీల్‌చైర్‌పై పెద్ద సాహసమే!

కర్నూలు జిల్లా: వెల్దుర్తి హైవేలో ఉండే ఉత్తరప్రదేశ్‌కు చెందిన హసీనా(40)కు ఐదుగురు సంతానం. భర్త మృతి చెందడంతో పిల్లలతో కలిసి చిన్నా, చితక పనులతోపాటు భిక్షాటన చేసి జీవనం సాగించేది. ఇదే క్రమంలో హైదరాబాద్‌కు వచ్చారు. మరో ముగ్గురు పిల్లలు బెంగళూరులోని ఓ ఆశ్రమంలో ఉంటున్నారు. వీరు కూడా లాక్ డౌన్ కారణంగా అక్కడకు వెళ్లలేకపోయారు. దీంతో పదేళ్ల వయసు ఉండే కొడుకు షారూక్.. ఏడాది పాపతో కలిసి బెంగళూరుకు వెళ్లేందుకు బయలుదేరారు. 


తల్లికి కాలు బాగోలేకపోవడంతో.. తల్లిని, చెల్లిని తోపుడు బండిపై కూర్చొబెట్టుకుని షారూక్ బండిని నెట్టుకుంటూ సుమారు 280 కి.మీ. వచ్చాడు. మధ్యలో బిక్షాటన చేస్తూ.. దాతలు ఇచ్చిన ఆహారంతో కడుపునింపుకుంటూ వచ్చారు. వెల్దుర్తి 44 జాతీయ రహదారి మార్గంలో వాళ్ల కష్టాన్ని గుర్తించిన స్థానిక యువకులు వారికి భోజనం పెట్టించారు. వారిని బెంగళూరులో ఉన్న ఆశ్రమానికి చేర్చేందుకు ఎస్ఐ నరేంద్రకుమార్ రెడ్డికి సమాచారం అందించారు. స్పందించిన ఎస్ఐ దోన్‌లోని ద్రోణాచలం సేవా సమితి సభ్యులకు సమాచారం అందించారు. వారు పీఎస్‌కు వచ్చి ఎస్ఐ.. అందరి ఆర్థిక సహాయంతో వాహనం ద్వారా బెంగళూరుకు చేర్చారు.

Updated Date - 2020-06-30T22:11:16+05:30 IST