తవ్వేస్తున్నారు..!

ABN , First Publish Date - 2021-04-11T05:45:13+05:30 IST

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు గుంటూరు రూరల్‌ మండలంలోని ఓబులునాయు డుపాలెం గ్రామాన్ని కొంతమంది అఽధి కార పార్టీ నాయకులు అడ్డాగా చేసుకొ న్నారు.

తవ్వేస్తున్నారు..!
వాగు భూమిలో కొనసాగుతున్న తవ్వకాలు

ఓబులునాయుడుపాలెంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు

గ్రామ పంచాయతీ అనుమతులు ఇవ్వకపోయినా ఆగని మైనింగ్‌

మైనింగ్‌, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం

హైకోర్టుని ఆశ్రయించిన పట్టాదారులు


గుంటూరు, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు గుంటూరు రూరల్‌ మండలంలోని ఓబులునాయు డుపాలెం గ్రామాన్ని కొంతమంది అఽధి కార పార్టీ నాయకులు అడ్డాగా చేసుకొ న్నారు. గ్రామ పంచాయతీ ఎలాంటి మైనింగ్‌కు అనుమతి ఇవ్వకపోయినా వాగు, పోరంబోకు భూములను తవ్వేస్తు న్నారు. దీని వలన వాటికి ఆనుకొని ఉన్న పట్టాభూములకు తీవ్ర నష్టం వాటిల్లు తోంది. దీనిపై పట్టాదారులు అభ్యంత రాలు పెడుతున్నా వారు ఏమాత్రం వెన క్కు తగ్గడం లేదు. సర్వే నెంబరు. 492/1, 3, 4, 9లో సుమారు ఏడు ఎకరాల వరకు ఉన్న భూమి 22(ఏ) నిషేధిత భూముల జాబితాలో ఉన్నప్పటికీ వాటి ల్లో జరుగుతున్న తవ్వకాలను అటు రెవె న్యూ, ఇటు మైనింగ్‌ అధికారులు అడ్డుకో వడం లేదు. ఈ తవ్వకాల వలన సర్వే నెంబరు. 492-5, 6, 7, 8లలో ఉన్న 5.60 ఎకరాల పట్టాభూములకు నష్టం వాటిల్లు తోంది. దీంతో ఇక చేసేది లేక పట్టాదారు లు హైకోర్టుని ఆశ్రయించారు. 

ఓబులునాయుడుపాలెంలో కేవలం 0.405 హెక్టార్లలో 600 క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ తవ్వకాలకు మైనింగ్‌ శాఖ తాత్కాలిక అనుమతిని మంజూరు చేసింది. కృష్ణా కెనాల్‌ - తెనాలి మధ్యన నిర్మా ణం జరుగుతున్న మూడో రైలుమార్గం కోసం దీనిని కేటా యించారు. ఈ సంవత్సరం మార్చి 27 నుంచి 31వ తేదీ మఽ ద్యన 600 క్యూబిక్‌ మీటర్లు తవ్వేందుకు మాత్రమే మైనింగ్‌ పర్మిషన్‌ ఇచ్చారు. అయితే దీనిని ఆస రాగా చేసుకొని వాగు భూమిని కొట్టేస్తు న్నారు. పట్టాభూములకు వాగు సరిహ ద్దు కావడం వలన అక్కడ జరుగుతున్న తవ్వకాలతో భూయజమానులకు నష్టం వాటిల్లుతోంది. దీనిపై బాధితులు మై నింగ్‌, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఎలాంటి చర్యలు తీసుకో కుండానే స్పందనలో ఫిర్యాదు పరిష్క రించినట్లుగాప్రభుత్వానికి నివేదించారు. 

ఈ అక్రమ మైనింగ్‌కు సూత్రదా రు లు అధికార పార్టీ నాయకులు కావడం తో వారిపై సంబంధిత అధికా రులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోన్నా రన్న విషయం బహిరంగ రహస్యమే. తమ ఫిర్యాదులపై అధికారులు స్పందించిన తీరుపై అసంతృప్తికి గురైన బాధితులు నేరుగా ఏపీ హైకోర్టులో రిట్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఓబులునాయుడుపాలెంలో అక్రమ మైనింగ్‌పై నిగ్గు తేల్చేందుకు ఉత్త ర్వులు జారీ చేసింది. విజిలెన్స్‌ అధి కారులు ఎంక్వయిరీ చేసి నివేదిక అంద జేయాలని ఆదేశించింది. అలానే నిషేధిత భూములు, వాగు భూముల్లో తవ్వకాలు జరిగి ఉంటే వాటిపై వివరాలను కోరింది. దీంతో అటు అధికారు లు, ఇటు అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 

Updated Date - 2021-04-11T05:45:13+05:30 IST