యథేచ్ఛగా వైసీపీ నాయకుల గ్రావెల్ దందా

ABN , First Publish Date - 2021-08-18T03:07:30+05:30 IST

వైసీపీ నేతల అక్రమార్జనే ధ్యేయంగా గ్రావెల్ రవాణాకు పాల్పడుతున్నారు.

యథేచ్ఛగా వైసీపీ నాయకుల గ్రావెల్ దందా

కృష్ణా: వైసీపీ నేతల అక్రమార్జనే ధ్యేయంగా గ్రావెల్ రవాణాకు పాల్పడుతున్నారు. వారు చేస్తున్న అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. పట్టించుకోవాల్సిన ఫారెస్ట్ అధికారులు మిన్నకుండిపోతున్నారు. కృష్ణా జిల్లాలోని పి. నైనవరం రిజర్వ్ ఫారెస్ట్‌లో వైసీపీ నేతలు యథేచ్ఛగా గ్రావెల్ దందాకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా వందలాది టిప్పర్లతో గ్రావెల్ రవాణాను అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. కొత్తూరు తాడేపల్లి పరిధిలో రెవెన్యూలో అక్రమ గ్రావెల్ దందా జరుగుతుందని గ్రామస్థుల సమాచారంతో రెవెన్యూ అధికారులు పరిశీలనకు వెళ్లారు. రెవెన్యూ అధికారులు పరిశీలనకు వచ్చిన ఫారెస్ట్ అధికారులు రాకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. అయితే అక్కడ జరుగుతున్న గ్రావెల్ దందా పి. నైనవరం ఫారెస్ట్ పరిధిలోదని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు.


విజయవాడ‌కు చెందిన అధికార పార్టీ నాయకులు పోలవరం కాలువ మట్టి రవాణాకు అనుమతులు తీసుకొని అక్రమంగా కొండలను వలిచివేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. అధికార పార్టీ నేతలు కావడంతో ఫారెస్ట్ అధికారులు కూడా చూసీ చూడన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతున్నా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రావెల్ తరలించే టిప్పర్లతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకుల అక్రమ గ్రావెల్ తోలకాలను అడ్డుకోవాలని స్థానికులు మొరపెట్టుకుంటున్నారు. 

Updated Date - 2021-08-18T03:07:30+05:30 IST