కంకర తేలిన వీరారెడ్డిపల్లి రోడ్డు
తాండూరు రూరల్ : రోడ్డుపై కంకర తేలడంతో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాండూరు మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి నుంచి సిరిగిరిపేట్ గేటు వరకు మూడు కిలో మీటర్ల మేర రోడ్డు కంకర తేలడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఐదేళ్ల క్రితం అధికారులు సిరిగిరిపేట్ గేటు నుంచి వీరారెడ్డిపల్లికి బీటీ రోడ్డు పూర్తి చేశారు. అయితే రోడ్డు పూర్తిగా కంకర తేలడంతో ప్రయాణికులు సిరిగిరిపేట్ గేటు నుంచి వీరారెడ్డిపల్లి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సిరిగిరిపేట్ గేటు నుంచి వీరారెడ్డిపల్లి గ్రామంవరకు బీటీ రోడ్డుపై డాంబర్ వేయాలని కోరుతున్నారు.