గ్రేవ్‌ కేసులను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-01-20T04:30:35+05:30 IST

గ్రేవ్‌ కేసులను పరిష్కరించాలి

గ్రేవ్‌ కేసులను పరిష్కరించాలి

వికారాబాద్‌: పెండింగ్‌లో ఉన్న గ్రేవ్‌( నేర తీవ్రత ఎక్కువగా ఉన్నవి)  కేసులను  వెంటనే పరిష్కరించాలని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీలు, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, అధికారులతో గ్రేవ్‌ కేసులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీ్‌సస్టేషన్‌ వారీగా గ్రేవ్‌ కేసుల వివరాలను తెలుసుకుని పెండింగ్‌లో ఉన్న  వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు.  ఇలాంటి కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో అట్టి విషయాలపై ప్రత్యేకమైన దృష్టి సారించాలన్నారు.  మహిళా సంబంధిత కేసుల పట్ల పోలీస్‌ అధికారులు  ఫిర్యాదుదారులకు త్వరగా న్యాయం అందించి నేరస్థులకు శిక్ష పడేవిధంగా దృష్టి పెట్టాలన్నారు.  పోలీ్‌సస్టేషన్ల పరిధిలో ఉండే రౌడీషీటర్స్‌, పాత నేరస్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి వారిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గలాటాలు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపైన రౌడీషీట్‌ ఓపెన్‌ చేయాలన్నారు.  జిల్లాలో అసాంఘీక కార్యకలాపాలు, మాట్కా, జూదం, పేకాట, గంజాయి, ఇసుక కేసులపై  దృష్టి సారించి కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి క్యూఆర్‌టీ టీమ్‌ ఏర్పాటు  చేస్తున్నామని తెలిపారు. పోలీస్‌ అధికారులు ఇట్టి టీమ్‌లను ఉపయోగించుకోవాలని, ఫంక్షనల్‌ వర్టికల్‌పైన అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.ఏ రషీద్‌, తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, పరిగి డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లాలోని అందరు సీఐలు, ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T04:30:35+05:30 IST