పాడి రైతులకు తప్పని గడ్డి కష్టాలు

ABN , First Publish Date - 2021-05-17T06:02:59+05:30 IST

పాడి రైతులకు గడ్డి కష్టాలు తప్పడంలేదు. ఎండలు అధికంగా ఉండడం, కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో కర్ఫ్యూ అమలులో ఉండడం రైతాంగానికి గడ్డి కష్టాలు తీవ్రంగా మారాయి.

పాడి రైతులకు తప్పని గడ్డి కష్టాలు

మదనపల్లె అర్బన్‌ మే 16: పాడి రైతులకు గడ్డి కష్టాలు తప్పడంలేదు. ఎండలు అధికంగా ఉండడం, కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో కర్ఫ్యూ అమలులో ఉండడం రైతాంగానికి గడ్డి కష్టాలు తీవ్రంగా మారాయి.  ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాడి ఆవుల పోషణకు అష్టకష్టాలు పడుతు న్నారు. పశువుల మేతకు అవసర మైన పచ్చిగడ్డి ఎండిపోవడంతో ఎండు గడ్డి కోసం తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. మదనపల్లె నియోజక వర్గంలో పదేళ్లుగా  సన్నకారు రైతు లు పాడిపశువుల పెంప కంపై ఆధారపడి జీవిస్తున్నారు.  పలమ నేరు, శ్రీకాళహస్తి, అనంతపురం జిల్లా కదిరి, నెల్లూరు, గూడూరు నుంచి ఎండుగడ్డి కొనుగోలు చేసి ట్రాక్టర్ల ద్వారా తీసుకువస్తున్నారు. ఒక్కొ ట్రాక్టర్‌ గడ్డి రూ.16 వేలు పలుకుతోంది.  కర్ఫ్యూ కారణంగా  ఎండుగడ్డి రవాణా కష్టమవుతోంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని పాడిరైతులు కోరుతున్నారు. 

Updated Date - 2021-05-17T06:02:59+05:30 IST