ఈ గ్రేప్స్‌ అదుర్స్‌!

ABN , First Publish Date - 2021-12-04T05:30:00+05:30 IST

ఈ చిత్రంలో కోడిగుడ్డు కన్నా పెద్దగా ఉన్నది ఏంటని అనుకుంటున్నారా? అవి గ్రేప్స్‌...

ఈ గ్రేప్స్‌ అదుర్స్‌!

ఈ చిత్రంలో కోడిగుడ్డు కన్నా పెద్దగా ఉన్నది ఏంటని అనుకుంటున్నారా? అవి గ్రేప్స్‌! జపాన్‌లో ఈ తరహా గ్రేప్స్‌కి బాగా డిమాండ్‌ ఇది. అక్కడి షాపుల్లో ఆపిల్స్‌, మెలన్స్‌తో పాటు ఈ పెద్ద సైజు గ్రేప్స్‌ కనిపిస్తున్నాయట. వియత్నాంకు చెందిన ఒక వ్యాపారి జపాన్‌ నుంచి వీటిని దిగుమతి చేసుకుని వాటి ఫోటోలను సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌ అయ్యాయి. ఇప్పటి వరకు అందరికీ గ్రేప్స్‌ అంటే చిన్నగా ఉన్నవి మాత్రమే తెలుసు. కోడిగుడ్డు కన్నా పెద్దగా ఉన్న గ్రేప్స్‌ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-12-04T05:30:00+05:30 IST