Abn logo
Dec 2 2020 @ 00:53AM

గ్రాన్యూల్స్‌ షేరు జిగేల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గ్రాన్యూల్స్‌ ఇండియాలో మెజారిటీ వాటాను కార్లైల్‌ గ్రూప్‌ చేజి క్కించుకోనున్నట్లు వార్తలు రావడంతో కంపెనీ షేరు కొత్త గరిష్ఠ స్థాయిని తాకింది. మంగళవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర ఒక దశలో 6 శాతం పెరిగి రూ.438 చేరింది. చివరకు 3.92 శాతం లాభంతో రూ.428.60 వద్ద క్లోజైంది. ఎన్‌ఎ్‌సఈలో 3.75 శాతం పెరిగి రూ.428 వద్ద ముగిసింది. గ్రాన్యూల్స్‌ ప్రమోటర్లకు చెందిన 42 శాతం వాటాను దాదాపు 100 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.7,400 కోట్లు) కార్లైల్‌ కొనుగోలు చేయనుందని, చర్చలు చివరి దశలో ఉన్నట్లు వార్తలు రావటమే షేరు జోరుకు కారణంగా ఉంది. 

Advertisement
Advertisement
Advertisement