కందుకూరు మున్సిపాలిటీకి ఎంపీ నిధులు

ABN , First Publish Date - 2021-05-17T07:23:30+05:30 IST

కందుకూరు పట్టణంలో కరోనా తీవ్రతను నియంత్రిం చే చర్యలలో భాగంగా మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణ కోసం ఒక ఎక్స్‌క వేటర్‌, ఒక ట్రాక్టరు కొనుగోలుకి ఆర్థిక సహాయం అందించనున్నట్లు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే మహీధర రెడ్డి వెల్లడించారు.

కందుకూరు మున్సిపాలిటీకి ఎంపీ నిధులు
బాధితులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

రెండు వాహనాల కొనుగోలు

కందుకూరు, మే 16: కందుకూరు పట్టణంలో కరోనా తీవ్రతను నియంత్రిం చే చర్యలలో భాగంగా మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణ కోసం ఒక ఎక్స్‌క వేటర్‌, ఒక ట్రాక్టరు కొనుగోలుకి ఆర్థిక సహాయం అందించనున్నట్లు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే మహీధర రెడ్డి వెల్లడించారు. కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా ఎంపీ నిధులకు కొంత తన సొంత నిధులను కూడా సమకూర్చి రెండు మూడురోజుల్లోనే ఈ వాహనాలు సమకూర్చేందుకు హామీ ఇచ్చారన్నారు. ఎంపీ ప్రతినిధి, నెల్లూరు విజయ డెయిరీ ఛైర్మన్‌ కె.రంగారెడ్డి ఆదివారం కందుకూరు కు వచ్చి ఎమ్మెల్యే మహీధర రెడ్డితో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న రెండవ డోస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహిస్తున్న కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ని పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా సెకండ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని రెండు మూడురోజుల్లో పూర్తి చేస్తామన్నారు. తొలివిడత వ్యాక్సిన్‌ వేయించుకోని వారికి కూడా ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో వేగవంతంగా నిర్వ హించాలన్న లక్ష్యంతో ప్రయత్నిస్తు న్నట్లు వివరించారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ను సందర్శించిన సందర్భంగా  కొవిడ్‌ బాధితులతో ఎంపి వీక్షణ సమావేశం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధతో తమను వారంలో మూడు రోజులు పరామర్శిస్తూ మంచి భోజనం, వైద్య ఏర్పాట్లు చేయటంతో పాటు యోగా క్లాసులు నిర్వహిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతు న్నారని వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ డి.సీతారామయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌. మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-17T07:23:30+05:30 IST