Abn logo
Mar 2 2021 @ 01:25AM

గ్రానైట్‌ క్వారీల్లో మైనింగ్‌ అధికారుల తనిఖీలు

బల్లికురవ, మార్చి 1 : మండలంలోని ఈర్లకొండ పరిధిలో  ఉన్న  రాఘవేంద్ర, లక్ష్మీ గ్రానైట్‌ క్వారీల్లో మైనింగ్‌ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఏజీ ఫణిభూషణ్‌రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది  పలు రికార్డులను, క్వారీల మ్యాప్‌లను పరిశీలించారు. కొలతలు తీశారు. అక్కడ ఉన్న గ్రానైట్‌ బ్లాక్‌లకు గుర్తులు వేశారు. అక్రమాల నిరోధానికి ఈ చర్యలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. త్వరలో అన్ని క్వారీల్లోనూ హద్దుల కొలతలు వేస్తామని, ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. వారి వెంట మైనింగ్‌ ఆర్‌ఐ రవితేజ, క్వారీల మేనేజర్లు పాల్గొన్నారు. న్నారు.


Advertisement
Advertisement
Advertisement