భద్రతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు

ABN , First Publish Date - 2021-01-27T04:42:12+05:30 IST

గనులలో సరైన భద్రతాచర్యలు పాటించకుంటే చర్యలు తప్పవని మైన్స్‌ అండ్‌ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్‌ యేజర్ల యోహాన్‌ హెచ్చరించారు.

భద్రతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు
మాట్లాడుతున్న డీడీ యోహాన్‌

కార్మికుడి మృతిపై విచారణ.. గ్రానైట్‌ క్వారీలను పరిశీలించిన డీడీఎంఎస్‌

బల్లికురవ, జనవరి 26 : గనులలో సరైన భద్రతాచర్యలు పాటించకుంటే  చర్యలు తప్పవని మైన్స్‌ అండ్‌ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్‌ యేజర్ల యోహాన్‌ హెచ్చరించారు. మంగళవారం బల్లికురవ ప్రాంతంలోని ఈర్లకొండ వద్ద ఉన్న ఇంపీరియల్‌ గ్రానైట్‌ క్వారీతోపాటు చుట్టుపక్కల ఉన్న క్వారీలను ఆయన పరిశీలించారు. ఆదివారం బ్లాస్టింగ్‌ కారణంగా కార్మికుడు అర్ముగం  మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయమై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యతలపై చర్యలు తీసుకుంటామని యోహోన్‌ తెలిపారు. ప్రమాదానికి కారణమైన రాయిని ల్యాబ్‌కు పంపుతున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం స్థానిక వీటీసీ భవన్‌లో విలేకరుల సమావేశంలో డీడీఎంఎస్‌ మాట్లాడారు. అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహిస్తే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. మైనింగ్‌ ఏడీ జగన్నాథరావు, మైనింగ్‌ సర్వేయర్‌ రవితేజ, వీటీసీ కార్యదర్శి సుభాస్కరరెడ్డి ఉన్నారు. 

Updated Date - 2021-01-27T04:42:12+05:30 IST