Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఘనంగా పెద్దమ్మ బోనాలు

ఇబ్రహీంపట్నం, నవంబరు 28: ఇబ్రహీంపట్నం గ్రామంలో ఆదివారం పెద్దమ్మ బోనాల పండుగను ముదిరాజ్‌ సంఘ సభ్యులు ఘనంగా నిర్వ హించారు. గ్రామ శివారులోని దుబ్బ మీద పెద్దమ్మ తల్లి దేవాలయంలో జాతర మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు నెత్తిన ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి అమ్మ వారికి బోనాలు సమర్పించారు. ఆలయ అవరణలో అన్నదాన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘ సభ్యులు, సర్పంచ్‌ లత-సత్యనారయణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement