ఘనంగా విజయదశమి వేడుకలు

ABN , First Publish Date - 2022-10-07T05:01:36+05:30 IST

దసరా పండుగ పురస్కరించుకుని పట్టణంలోని ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.

ఘనంగా విజయదశమి వేడుకలు
ప్రత్యేకపూజలు అందుకున్న గోరకాటి పెద్దమ్మ దేవత

ధర్మవరం, అక్టోబరు6: దసరా పండుగ పురస్కరించుకుని పట్టణంలోని  ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. శ్రీనివాసనగర్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విష్ణు పారమాత్మక, శ్రీరామతారక హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను  అర్చకులు నిర్వహించారు. అనంతరం స్వామివారు విశ్వ రూప అలంకరణలో  దర్శనమిచ్చారు. అలాగే వాసవీ కన్యకాపరమేశ్వరి దేవిని విజయలక్ష్మీదేవిగా అలంకరించి సాయంత్రం గ్రామోత్సవాన్ని నిర్వ హించారు. విజయదుర్గాదేవి అలంకరణలో శాంతకల చౌడేశ్వరిదేవి, సాలేవీధిలో ప్రత్యేక అలంకరణలో పెద్దమ్మ, స్వర్ణకవచ అలంకరణలో అం బా భవాని భక్తులకు దర్శనమిచ్చారు. అంబాభవానికి సాయంత్రం ఉయ్యా లోత్సవం నిర్వహించారు. వాసవీమాత గ్రామోత్సవంలో అన్నమయ్యసేవా మండలి సభ్యులు పొరాళ్లపుల్లయ్య బృందం అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి గాయత్రిదేవిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకుని పూజలుచేయించారు.

కొత్తచెరువు(బుక్కపట్నం): దేవీనవరాత్రి ఉత్సవాలలో భాగంగా దసరా పండుగ వేడుకలను గురువారం ఆలయాల్లో వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని కొత్తచెరువమ్మ, పెద్దమ్మతల్లి, తలమర్ల గ్రామంలో యల్లమ్మతల్లి ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. పెద్దమ్మతల్లిని  పల్లకిలో ఉంచి పురవీధుల్లో ఊరేగించారు.

ధర్మవరంరూరల్‌: పట్టణంలోని నేసేపేటలో వెలసిన గోరకాటి పెద్దమ్మ కు బుధవారం భక్తులు వివిధరకాల నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజ లు చేశారు. మండలవ్యాప్తంగా దసరా పండుగను సంబరంగా చేసు కున్నారు.  గ్రామదేవతలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. 

పుట్టపర్తిరూరల్‌: దేవీశరన్నవ రాత్రి ఉత్సవాలలో భాగంగా దశమి రోజు బుధవారం కోవెలగుట్టపల్లిలో దుర్గాదేవి రాజరాజేశ్వరిగా, మామిళ్ళకుంట లలితాదేవి మహిశాసురమర్థినిగా  దర్శనమిచ్చారు. అమ్మవారికి ఉదయా న్నే ప్రత్యేక పూజలు చేశారు. మామిళ్ళకుంట లలితాదేవి ఆలయంలో, ఎనుమలపల్లి దుర్గాదేవి ఆలయాల్లో లోక క్షేమాన్ని కాంక్షిస్తూ... ఆలయ ధర్మకర్త వర్మగురూజీ ఆధ్వర్యంలో చండీహోయం చేసి పూర్ణాహుతితో ముగించారు. పెద్దఎత్తున అన్న, వస్త్రదాన కార్యక్రమాలను  నిర్వహించారు. సాయంత్రం, పల్లకీసేవ, లలితా సహస్రనామ పారాయణం అనంతరం మహామంగళహారతి సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు 

ముదిగుబ్బ : మండల కేంద్రంలోని పాత ఊరులో వెలసిన కనకదుర్గ మ్మకు దసరా సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంద ర్భంగా మాలపాటి జగదీశ ఆధ్వర్యంలో 101 బిందెల నీరు, 101 నిమ్మ కాయలు, 101 పుష్పాలతో కుంబాభిషేకం చేశారు. మహిళలు అమ్మవారికి గాజుల అలంకరణ చేసి చీర, గాజులు, వడి బియ్యం సమర్పించారు. 

్లనంబులపూలకుంట: దసరా పండుగ సందర్భంగా బుధవారం మండలంలోని తూర్పునడింపల్లి, ఎన్పీకుంట, పెడబల్లి, పీ కొత్తపల్లి గ్రా మాల్లోని చౌడేశ్వరీ దేవి ప్రత్యేకాలంకరణలో కొరులుదీరారు. అలాగే ఎన్పీ కుంట భ్రమరాంభికా, యల్లమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. 

్లఅమడగూరు: దసరా వేడుకలను బుధవారం స్థానిక  చౌడేశ్వరీదేవి, కొత్తపల్లి కొదండరామస్వామి, జౌకల కొత్తపల్లి  వెంకటేశ్వరస్వామి తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. దసరా సందర్భంగా వాహనాలకు ప్రత్యేక అలంకరణంలో పూజించారు. 



Updated Date - 2022-10-07T05:01:36+05:30 IST