ఘనంగా తిరంగా ర్యాలీ

ABN , First Publish Date - 2022-08-15T05:02:36+05:30 IST

పట్టణంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో దేశ విభజన భయానక స్మారక దినోత్సవాన్ని నిర్వహించారు. బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి పోతుగుంట రమే్‌షనాయుడు ఆధ్వర్యంలో ఆ పార్టీ పిలుపు మేరకు పట్టణంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులు చేతపట్టుకొని పట్టణంలోని గాంధీ సర్కిల్‌ నుంచి పాత పోలీ్‌సలైన్‌, పాతబస్టాండు, ఆర్‌ఎస్‌ రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించారు.

ఘనంగా తిరంగా ర్యాలీ
సిద్దవటం కోటలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా

రాజంపేట, ఆగస్టు 14: పట్టణంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో దేశ విభజన భయానక స్మారక దినోత్సవాన్ని నిర్వహించారు. బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి పోతుగుంట రమే్‌షనాయుడు ఆధ్వర్యంలో ఆ పార్టీ పిలుపు మేరకు పట్టణంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులు చేతపట్టుకొని పట్టణంలోని గాంధీ సర్కిల్‌ నుంచి పాత పోలీ్‌సలైన్‌, పాతబస్టాండు, ఆర్‌ఎస్‌ రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆదినారాయణ, నాగరాజు, శ్రీనివాసులు, సురే్‌షరాజు, సుభద్ర, సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు.

గాంధీ విగ్రహం ఎదుట సీఐటీయూ నిరసన

రాజంపేట గాంధీ విగ్రహం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌, జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను అమలు పరచకుండా కార్మిక హక్కులను కాలరాస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రవికుమార్‌, విద్యుత్‌ శాఖ డివిజన్‌ కార్యదర్శి బాలకృష్ణ, డివిజన్‌ అధ్యక్షుడు సుధాకర్‌, మున్సిపల్‌ కార్మిక నాయకులు ఓబయ్య, లక్ష్మీదేవి, సరస్వతీ, విజయలక్ష్మీ, ప్రసన్న పాల్గొన్నారు.


పెనగలూరులో: మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్‌) మండల అధ్యక్షుడు జయరాం అధ్యక్షతన ఆదివారం సాయంత్రం మండల కేంద్రంలో త్రివర్ణ పతాకాలతో ర్యాలీ జరిగింది. దళితవాడలోని విద్యార్థులతో కలిసి ఎంఆర్‌పీఎస్‌ కార్యకర్తలు ఉన్నత పాఠశాల సమీపం నుంచి మూడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కార్యకర్తలు పల్లాల రమణయ్య, పి.చలపతి పి.వీరయ్య, పి.నరసింహులు, పి.వెంకటే్‌ష (బద్రి) పాల్గొన్నారు.


వీరబల్లిలో: ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావం పెంపొందించేందుకే ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను నిర్వహిస్తున్నామని టీడీపీ మండల అధ్యక్షుడు భానుగోపాల్‌రాజు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని బస్టాండు ప్రాంగణంలో ఆదివారం టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం గావించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ వెంకటరామరాజు, రాంమోహన్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సురేంద్ర, ప్రభాకర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. 


రైల్వేకోడూరులో: పట్టణంలోని దక్షిణాంధ్ర లూథరన్‌ చర్చిలో ఆదివారం ముందస్తుగా స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకులు చర్చి సంఘం కోశాధికారి ఆనంద్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేశం సుభిక్షంగా ఉండాలని ఫాస్టర్‌ మనోజ్‌కుమార్‌ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో చర్చి సంఘం చైర్మన్‌ ఉదయ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ అన్నమ్మ, కార్యదర్శి రాజారత్నం పాల్గొన్నారు.


నందలూరులో: ఇంటింటా జెండా పండుగను ఘనంగా జరుపుకోవాలని ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌ జంబు సూర్యనారాయణ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు అక్కిరెడ్డి మోహనరెడ్డి, ఆకేపాటి రమే్‌షరెడ్డి, మట్టిబాబు, నాగేంద్ర, అక్కి వెంకటరమణ, కాకి చంద్ర, ఓర్సు శ్రీను తదితరులు పాల్గొన్నారు.


సిద్దవటంలో: సిద్దవటం కోటలో ఆగస్టు 15న జెండా ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా పురాతత్వ సర్వేక్షణ అధికారి రాజా యోగేష్‌ పేర్కొన్నారు. మండల కేంద్రమైన సిద్దవటం మట్లిరాజుల కోటలో ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కోటలో వేడుకలు నిర్వహిస్తున్నా మన్నారు. జెండా ఆవిష్కరణకు అన్ని శాఖల ప్రభుత్వ అధికారులను ఆహ్వానించామని తెలిపారు. 

Updated Date - 2022-08-15T05:02:36+05:30 IST