ఘనంగా రక్షాబంధన్‌ వేడుకలు

ABN , First Publish Date - 2022-08-13T05:39:25+05:30 IST

గోదావరిఖని పట్టణంలో శుక్రవారం రక్షాబంధన్‌ను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా రక్షాబంధన్‌ వేడుకలు
కేసీఆర్‌ చిత్రపటానికి రాఖీ కడుతున్న మహిళలు

కళ్యాణ్‌నగర్‌, ఆగస్టు 12: గోదావరిఖని పట్టణంలో శుక్రవారం రక్షాబంధన్‌ను ఘనంగా నిర్వహించారు. అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీలు కట్టారు. రాఖీ పండుగ సందర్భంగా గోదావరిఖనిలోని మిఠాయి దుకాణా లు, బట్టల షాపులు కిక్కిరిసిపోయాయి. ఊర్లకు వెళ్లేవారు చాలా మంది ఉండడంతో బస్టాండ్‌ ప్రయాణికులతో కిటకిటలాడింది. చాలా మంది ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించారు. సమీప గ్రామాలకు వెళ్లేవారు ద్వి చక్రవాహనాలపైనే వెళ్లారు. గోదావరిఖని చౌరస్తాలో వన్‌టౌన్‌ ఎస్‌ఐ మామిడి శైలజ, మహిళా కానిస్టేబుళ్లు టీఆర్‌ఎస్‌ నాయకులకు, స్థానికుల కు రాఖీ కట్టింది. ఈ కార్యక్రమంలో దీటి బాలరాజు, చెరుకు బుచ్చిరెడ్డి, మహ్మద్‌ సన్ని, గోపగోని నవీన్‌, అన్ను ఉన్నారు. టుటౌన్‌ శ్రీనివాసరావుకు ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ జక్కిని శ్రీలత రాఖీ కట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రపటాలకు మహిళలు రాఖీ కట్టారు. ఎమ్మె ల్యే కోరుకంటి చందర్‌ మాట్లాడుతూ పేద మహిళలకు ఆసరా పెన్షన్లు, ఒంటరి మహిళలకు పెన్షన్‌ అందించడంతో పాటు అమ్మఒడి, కల్యాణ లక్ష్మిలాంటి పథకాలు ప్రవేశపెడుతూ ఆడపడుచులకు నేను ఉన్నానం టూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభయహస్తం ఇస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, కార్పొరేటర్‌ బాల రాజ్‌కు మార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు నారాయణదాసు మారుతి, అచ్చె వేణు, తో కల రమేష్‌, యోగాగురువులు సుధ, సుజాత పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-13T05:39:25+05:30 IST