Photo: అవ్వను వరించిన అదృష్టం

ABN , First Publish Date - 2022-08-24T14:35:18+05:30 IST

ఓ ఫొటోకు ఫోజిచ్చిన నాగర్‌కోవిల్‌(Nagercoil)కు చెందిన బోసినప్వుల బామ్మ వేలమ్మాళ్‌కు అదృష్టం వరించింది. నీడలేని ఆ బామ్మకు ప్రభుత్వం ఓ

Photo: అవ్వను వరించిన అదృష్టం

                - రేషన్‌ కానుకలతో ఫొటోకు ఫోజిచ్చిన బోసి నవ్వుల బామ్మకు ఇల్లు, పింఛను


చెన్నై ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఓ ఫొటోకు ఫోజిచ్చిన నాగర్‌కోవిల్‌(Nagercoil)కు చెందిన బోసినప్వుల బామ్మ వేలమ్మాళ్‌కు అదృష్టం వరించింది. నీడలేని ఆ బామ్మకు ప్రభుత్వం ఓ ఇల్లు కేటాయించడంతో పాటు ఫించన్‌ను కూడా మంజూరు చేసింది. సంక్రాంతి(Sankranti) సందర్భంగా ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు రెండు వేల నగదు, ఉచిత కిరాణా సరుకులను పంపిణీ చేసింది. నాగర్‌కోవిల్‌లో నివసిస్తున్న వేలమ్మాళ్‌ అనే వృద్ధురాలు రేషన్‌షాపుకు వెళ్ళి ఓ చేత రెండువేల రూపాయలు, మరో చేత ప్రభుత్వమిచ్చిన కానుకలను పట్టుకుని వస్తుండగా ఓ ఫొటోగ్రాఫర్‌ ఫొటోకు ఫోజివ్వమని అడిగాడు. దీనితో ఆ బామ్మ పళ్లులేని నోరు తెరచి నవ్వుతూ ఫోజిచ్చింది. ఆ ఫొటో సామాజిక ప్రసారమాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ఆ ఫొటో చూసి ‘ఆ బామ్మ సంతోషమే మా ప్రభుత్వ సంతోషం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ పథకాల వివరాల ప్రకనటలలో ఆ బామ్మ ఫొటోకు స్థానం కల్పించారు. ఇదిలా ఉండగా మార్చి ఏడున ముఖ్యమంత్రి స్టాలిన్‌ నాగర్‌కోవిల్‌ పర్యటన సందర్భంగా ఆ బామ్మను కలుసుకున్నారు. ఆ సందర్భంగా వేలమ్మాళ్‌ తనకు ఇల్లు, వృద్ధాప్య ఫించను మంజూరు చేయాలని కోరారు. వీలైనంత త్వరగా నెరవేరుస్తానని స్టాలిన్‌ హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇటీవల ఆ బామ్మకు ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేసింది. ఆ తర్వాత అంజుగ్రామం పాలకుళం ప్రాంతంలోని ప్రభుత్వ గృహసముదాయంలోని ఓ ప్లాట్‌ అధికారులు ఆమెకు కేటాయించారు. సోమవారం సాయంత్రం ఆర్డీవో సేతురామలింగం ప్లాట్‌ కేటాయింపు పత్రాన్ని అందించడంతో వేలమ్మాళ్‌ సంతోషానికి పట్టపగ్గాలు లేకపోయింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆమె ధన్యవాదాలు తెలుపుకున్నారు.

Updated Date - 2022-08-24T14:35:18+05:30 IST