ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ABN , First Publish Date - 2022-08-20T05:09:48+05:30 IST

జిల్లాలోని పలు ఆలయాలు, గ్రామాలు, ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు.

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
నాంచార్‌పల్లి పాఠశాలలో కృష్ణుడు, గొల్లభామ వేషధారణలో చిన్నారులు

సిద్దిపేట అర్బన్‌/సిద్దిపేట రూరల్‌/సిద్దిపేట అగ్రికల్చర్‌/దుబ్బాక/మిరుదొడ్డి/చేర్యాల/హుస్నాబాద్‌రూరల్‌/చిన్నకోడూరు, ఆగస్టు 19: జిల్లాలోని పలు ఆలయాలు, గ్రామాలు, ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. శ్రీకృష్ణుడు, గోపిక వేషధారణలో చిన్నారులు అలరించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణంలోని లాల్‌ కమాన్‌ వద్ద గల సుందర సత్సంగం భవనంలో అభిషేకాలు నిర్వహించారు. సిద్దిపేట అర్బన్‌ మండలం నాంచార్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలోని వేంకటేశ్వరాలయంలో సినీ నటుడు శ్రవన్‌రాఘవేంద్ర దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. చేర్యాల, కొమురవెల్లి మండలాల ప్రజలు అత్యంత భక్తిప్రపత్తులతో శ్రీకృష్టామిని జరుపుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను శ్రీకృష్ణుడు, సత్యభామ, రుక్మిణి, గొల్లభామల వేషధారణతో అలంకరించారు. హుస్నాబాద్‌ పట్టణంలోని కేరళ ఇంగ్లీ్‌ష మీడియం, నవభారత్‌ ఇంగ్లీష్‌ మీడియం, సీవిరామన్‌ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్‌ మండలం పొట్లపల్లి అంగన్‌వాడి పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. సిద్దిపేట రూరల్‌ మండల పరిధిలోని ఇర్కోడ్‌ గ్రామ శివారులో సిద్దిపేటకు చెందిన గడ్డమీది కల్పన వేణుగోపాల్‌ దంపతులు నిర్మిస్తున్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహించారు. చిన్నకోడూరు మండలంలోని పలు గ్రామాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 


 

Updated Date - 2022-08-20T05:09:48+05:30 IST