ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ABN , First Publish Date - 2022-08-20T04:48:39+05:30 IST

జిల్లా వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
వీరపునాయునిపల్లెలో పూజలందుకుంటున్న వేణుగోపాలస్వామి

పెండ్లిమర్రి, ఆగస్టు 19: జిల్లా వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనేక ఆలయాల్లో శ్రీకృష్ణునికి శంఖాభిషేకం, పుష్పాభిషేకం, ప్రత్యేక అలంకారాలు గావించారు. గోవులకు పసుపు, కుంకు మ పూసి నూతన వస్త్రాలతో అలంకరించి ఆలయం లో ప్రదక్షిణ చేయించారు. అనంతరం భక్తులకు ప్ర సాదాన్ని పంపిణీ చేశారు. మధ్యాహ్నం అన్నదానం చేపట్టారు. సంగాలపల్లెలో శివకృష్ణ గోసంరక్షణశాలలో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఉట్టి కొట్టేందు కు ఉత్సహంగా పాల్గొన్నారు. పాఠశాలల్లో చిన్నారుల వేషధారణ ఆకట్టుకుంది. కృష్ణుడు, గోపికల వేషాలతో అలంకరించారు. వివరాల్లోకెళితే....

  ప్రముఖ క్షేత్రం పొలతల మల్లేశ్వరస్వామి దేవస్థా నంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయబద్దంగా గోమాతకు పూజలు నిర్వహించి భక్తులకు గోమహత్యం గురించి వివరించారు. ఆలయ ఈఓ మహేశ్వరరెడ్డి, ఆలయ చైర్మన్‌ రాజగోపాల్‌ రెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.

వీరపునాయునిపల్లెలో....

అడవిచెర్లోపల్లె వేణు గోపాలస్వామి ఆలయం, సంగాలపల్లెలోని శివకృష్ణ గోశాల, వీరపునాయునిపల్లె శ్రీకృష్ణ ఆలయాల్లో శ్రీకృ ష్ణాష్టమి నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘునాథరెడ్డి, మైనింగ్‌ డైరెక్టర్‌ వీరప్రతాప్‌రెడ్డి, కాం ట్రాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, సంగమేశ్వరాలయం చైర్మన్‌ శివాంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

చెన్నూరులో....

స్థానిక రాధాకృష్ణ భజన మందిరం లో కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గోకులాష్టమి కావున గోవులకు మహిళల చేత పూజలు నిర్వహింపజేశారు. 

చింతకొమ్మదిన్నెలో....

మండలంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. బుగ్గలపల్లె కృష్ణాలయం, ఊటుకూరు కృష్ణాలయాల్లో  స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేయించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేదపండితుల సమక్షంలో సత్యభామ సమేత వేణుగోపాలస్వామికి కల్యాణోత్స వం నిర్వహించారు. అనంతరం స్వామివారి సన్నిధి లో భక్తులకు అన్నదానాలు, చెక్కభజనలు నిర్వహించారు. రథోత్సవం కన్నుల పండువగా చేశారు.

వేంపల్లెలో....

మండలంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వడ్డె వీధిలోని శ్రీకృష్ణ దేవా లయంలో ఆలయ వ్యవస్థాపకుడు దేరంగుల రా మాంజనేయులు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించా రు. స్థానిక చైతన్య హైస్కూల్లో కరస్పాండెంట్‌ చక్ర పాణిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వ హించారు. చిన్నారులు కృష్ణులు, గోపికల వేషధారణ తో ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. వేంపల్లె ఉషాకిరణ్‌ హైస్కూల్లో కరస్పాండెంట్‌ రమణారెడ్డి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. చిన్నారులు వేషధారణలతో అలరించారు. 

కమలాపురంలో....

స్థానిక రైల్వే గేటు సమీపంలో వెలసిన శ్రీ రాధాకృష్ణ ఆలయంలో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ 6వ వార్షికోత్సవాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా  ని ర్వహించారు. ఆలయ 6వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. బండలాగు డు పోటీల్లో మొదటి బహుమతి మామిళ్ల సుబ్బారెడ్డి, రెండో బహుమతిని సెంథిల్‌ కుమార్‌రెడ్డి, మూడో బహుమతి మల్లికార్జునరెడ్డి, నాలుగో బహుమతి బం డి వెంకటశివారెడ్డి,  ఐదో బహుమతి భోగాది గోపాల్‌ విజేతలుగా నిలిచారు. వీరికి పుత్తా నరసింహారెడ్డి, చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు.







Updated Date - 2022-08-20T04:48:39+05:30 IST