ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ABN , First Publish Date - 2022-08-19T04:48:07+05:30 IST

కృష్ణాష్టమి వేడుకలు జిల్లావ్యాప్తం గా గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. చిన్నారుల వేషధారణలు అలరించాయి.

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
హిందూపురంలో చిన్నారుల వేషధారణ

హిందూపురం అర్బన, ఆగస్టు 18: కృష్ణాష్టమి వేడుకలు జిల్లావ్యాప్తం గా గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. చిన్నారుల వేషధారణలు అలరించాయి. ఉట్టికొట్టి రంగులు చల్లుకుంటూ సంబరాలు చేశారు. హిం దూపురంలోని పాంచజన్య బ్రిలియన్స, చైతన్య, జ్ఞానజ్యోతి పాఠశాలల్లో  వే డుకలు అంబరాన్నంటాయి. చిన్నారులు శ్రీకృష్ణ, సత్యభామల వేషధారణతో  మైమరిపించారు. ఉత్సాహంగా ఉట్టికొట్టారు. చిన్నారుల వేషధారణలతో గ్రూప్‌ ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ ఆనందాన్ని పంచుకున్నారు.


చిలమత్తూరు: మండలంలోని టేకులోడు గురుకుల పాఠశాలలో విద్యార్థులు రాధాకృష్ణుల వేషధారణలతో మైమరిపించారు. చేతిలో వేణువుని ప ట్టుకొని నృత్యాలు చేశారు. చిన్ని కృష్ణయ్య చిలిపి చేష్టల సన్నివేశాలను అ ద్భుతంగా ప్రదర్శించారు. ఉట్టికొట్టి ఆడిపాడారు. ప్రిన్సిపాల్‌ మహదేవన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు ఆటపాలు, సాంప్రదాయాలు పా టించాలన్నారు. వేడుకల్లో అసిస్టెంట్‌ ప్రిన్సిపాల్‌ తిరుమలరావు, భార్గవి, జ యసింహనాయుడు, చైర్మన శ్రీనివాసులు పాల్గొన్నారు. 


నేడు వేణుగోపాలస్వామి ఆలయంలో... 

హిందూపురం అర్బన: పట్టణ పరిధిలోని చిన్నమార్కెట్‌ సర్కిల్‌ వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం గోకులాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం శ్రీవారి కల్యాణోత్సవం, మధ్యాహ్నం బ్రహ్మరథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఈఓ నరసింహమూర్తి తెలిపారు. భజనలు, భగవద్గీత, విష్ణుసహస్త్ర పారాయణం, పురంధరదాసు కీర్తనలు ఆల పించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు. 


సోమందేపల్లిలో... 

సోమందేపల్లి: మండల కేంద్రంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు ఘ నంగా నిర్వహించనున్నట్లు యాదవ సంఘం సభ్యులు పేర్కొన్నారు. పా తూరు కాళమ్మ ఆలయం నుంచి శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఊరేగిస్తామన్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశామని తెలిపారు.


విశ్వహిందూపరిషత ఆధ్వర్యంలో...

పెనుకొండ: పట్టణంలో విశ్వ హిందూపరిషత ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి, పరిషత వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వీహెచపీ ప్రఖండ అధ్యక్షుడు వేద వ్యాస్‌ తెలిపారు. మధ్యా హ్నం స్థానిక గొల్లపాళ్యం శ్రీకృష్ణ ఆలయం నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని చిన్నారుల వేషధారణతో బోగసముద్రం చెరువు వరకు ఊరేగిస్తామ న్నారు. భక్తులు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.


యాదవ సంఘం ఆధ్వర్యంలో... 

పెనుకొండ పట్టణంలోని గోపాలస్వామి ఆలయంలో స్థానిక యాదవ సం ఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అనంతరం శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణ, చక్కభజన, కీలుగుర్రాల ప్రదర్శనలతో స్వామివారి ఊరేగింపు, ఉట్టికొట్టే కార్యక్రమం, సాంస్కృతిక ప్ర దర్శనలు ఉంటాయన్నారు. సాయంత్రం ఉయ్యాలసేవ నిర్వహిస్తారన్నారు. భక్తులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. 

Updated Date - 2022-08-19T04:48:07+05:30 IST