ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి

ABN , First Publish Date - 2022-09-28T05:11:06+05:30 IST

కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని మంగళవారం మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిఽధులు, నాయకులు, పలు సంఘాల నాయకులు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపూజీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణా ఉద్యమంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ పాత్ర మరువలేనిదని కొనియాడారు.

ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి
పటాన్‌చెరులో బాపూజీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని మంగళవారం మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిఽధులు, నాయకులు, పలు సంఘాల నాయకులు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపూజీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణా ఉద్యమంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. 


సంగారెడ్డి రూరల్‌/మెదక్‌ అర్బన్‌/మెదక్‌ మున్సిపాలిటీ/పటాన్‌చెరు/పెద్దశంకరంపేట/అల్లాదుర్గం/తూ ప్రాన్‌/నారాయణఖేడ్‌/జహీరాబాద్‌/చిన్నశంకరంపేట, సెప్టెంబరు 27: సంగారెడ్డిలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ మంజూశ్రీజైపాల్‌రెడ్డి, కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ రమణకుమార్‌ నివాళులర్పించారు. మెదక్‌లో అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ నివాళులర్పించారు. పటాన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ కుమార్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, సీఐ వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు గూడెం మధుసూధన్‌రెడ్డి, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు రాజమల్లయ్య, నాయకులు వేముల రమేష్‌, రఘురాములు పాల్గొన్నారు. పెద్దశంకరంపేటలో ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మురళిపంతులు, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు, నాయకులు సుభా్‌షగౌడ్‌, రాజేష్‌, ఆర్‌ఎన్‌.సంతో్‌షకుమార్‌, శంకర్‌గౌడ్‌, పున్నయ్య, శ్రీశైలం, ఎంపీడీవో రియాజుద్దిన్‌, సిబ్బంది షాకీర్‌, కాశీరాం పాల్గొన్నారు. అల్లాదుర్గంలో పద్మశాలీ సంఘం నాయకులు కాళ్ల రాములు, నీలి రమేష్‌, వెంకట్‌, కృష్ణమూర్తి, లక్ష్మన్‌, పెంటయ్య బాపూజీ జయంతిని నిర్వహించారు. తూప్రాన్‌ పట్టణంలో నిర్వహించిన బాపూజీ జయంతిలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నందాల శ్రీనివాస్‌, పద్మశాలీ సంఘం నాయకులు వెంకటనారాయణ, వెంకటరాములు, నాగరాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు సతీ్‌షచారి, మన్నె శ్రీనివాస్‌, దామోదర్‌రెడ్డి, చెలిమెల జయరాములు పాల్గొన్నారు. మెదక్‌లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిలో మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌, కమిషన్‌ శ్రీహరి, మాజీ వైస్‌చైర్మన్‌ రాగి అశోక్‌, కౌన్సిలర్లు, నాయకులు వంజరి జయరాజ్‌, ఆర్‌కె శ్రీనివాస్‌, భీమరి కిషోర్‌, బొద్దుగుల కృష్ణ, ఉమర్‌ పాల్గొన్నారు. అలాగే పద్మాశాలీ సంఘం ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు చెన్న రాంచంద్రం, జిల్లా అధ్యక్షుడు వీరభద్రయ్య, కార్యదర్శి శ్రీపాల్‌, చేనేత అధ్యక్షుడు బొద్దుల సంతోష్‌, శ్రీధర్‌, లక్ష్మీనారాయణ, వెంకటేశం, రమేష్‌ నిర్వహించారు. నారాయణఖేడ్‌లో మోడల్‌ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బాపూజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. పద్మశాలీ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో నాయకులు అనంతం, నర్సింలు, శ్రీనివాస్‌, పండరి, భాస్కర్‌, నక్క నర్సింలు, మెట్టు శ్రీను, సిద్ధు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని జహీరాబాద్‌ నియోజకవర్గంలోని కోహీర్‌, ఝరాసంగం, జహీరాబాద్‌, న్యాల్‌కల్‌, మొగుడంపల్లి, జహీరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్‌లో మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ సుభా్‌షరావు నివాళులర్పించారు. కార్యక్రమాల్లో గడ్డం జనార్ధన్‌, రాములునేత, మనోహర్‌, నాందేవ్‌, ఒగ్గు బండారి, సుదర్శన్‌, విఠల్‌, తుక్కరాం, విజయ్‌, పాండు, వెంకటయ్య, సుధీర్‌, నర్సిములు, పండరి, విజయ్‌, విఠల్‌, శ్రీనివాస్‌, వెంకటేషం, లక్ష్మణ్‌, మల్లయ్య, శివకుమార్‌ పాల్గొన్నారు. చిన్నశంకరంపేటలో తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు, పద్మశాలీ సంఘం నాయకులు నర్సింహులు, కృష్ణ, వెంకట్‌ పాల్గొన్నారు. 


 



Updated Date - 2022-09-28T05:11:06+05:30 IST