ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-15T03:55:35+05:30 IST

కాగజ్‌నగర్‌ పట్ట ణంలో ఆదివారం రిటైర్డ్‌ఆర్మీ అసోసియేషన్‌ ఆధ్వర్యం లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌శ్రీనివాస్‌ జెండాఊపి ప్రారంభిం చారు. అనంతరం మాట్లాడుతూ ఇంటింటా జాతీయ జెండాను ఏర్పాటుచేయాలని సూచించారు.

ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు
కాగజ్‌నగర్‌లో బైక్‌ ర్యాలీలో పాల్గొన్న రిటైర్డ్‌ ఆర్మీ సభ్యులు, బీజేపీ నాయకులు, స్వచ్చంద సంస్థల సభ్యులు

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఆగస్టు 14: కాగజ్‌నగర్‌ పట్ట ణంలో ఆదివారం రిటైర్డ్‌ఆర్మీ అసోసియేషన్‌ ఆధ్వర్యం లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌శ్రీనివాస్‌ జెండాఊపి ప్రారంభిం చారు. అనంతరం మాట్లాడుతూ ఇంటింటా జాతీయ జెండాను ఏర్పాటుచేయాలని సూచించారు. రిటైర్డ్‌ ఆర్మీ అసోసియేషన్‌ నాయకులు మాట్లాడుతూ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని వివిధ కార్యక్రమాల ను చేపడుతున్నట్టు తెలిపారు. బీజేపీ నాయకుడు డాక్టర్‌ హరీష్‌బాబు, కొంగ సత్యనారాయణ పాల్గొన్నా రు. అలాగే పట్టణం, మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో కుమరంభీం విగ్రహాలను శుద్ధిచేసి పూలమాలలు వేశారు. మండలంలోని ఈసుగాంలో సుభాష్‌చంద్ర బోస్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం బైక్‌ ర్యాలీ చేపట్టారు. పట్టణంలో వివిధఆస్పత్రుల్లో రిటైర్డ్‌ ఆర్మీసభ్యులు పండ్లుపంపిణీ చేశారు. మున్సిపల్‌ చైర్మెన్‌ సద్ధాం హుస్సేన్‌ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పలు కూడళ్లలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈనెల8నుంచి 22వరకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆయాకార్యక్రమాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

రెబ్బెన:స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఆదివారం రెబ్బెన మండలం గోలేటిలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు అంబేద్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కన్వీనర్‌ కేసరిఆంజనేయులుగౌడ్‌ మా ట్లాడుతూ ప్రతిఒక్కరు తమఇంటిపై జాతీయజెండాను ఎగుర వేయాలని కోరారు. అనం తరం హర్‌ఘర్‌ తిరంగా యాత్రను చేపట్టారు. స్థానిక వ్యాపారసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వ హించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో అంతా పాల్గొనాలని పిలుపు నిచ్చారు.

ఆసిఫాబాద్‌: జిల్లా కేంద్రంలో బీజేపీజిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీని వాస్‌ అంబేద్కర్‌, గాంధీజీ, నేతాజీ, వివేకానంద, పొట్టి శ్రీరాములు విగ్రహాలను శుభ్రపరిచి పూలమాలలు వేశారు. కార్యక్రమంలోకృష్ణకుమారి, నాయకులు విజ య్‌, చక్రపాణి, మురళీపాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో ఆదివారం ఫ్రీడమ్‌ బైక్‌ర్యాలీని నిర్వహించారు. నాయకులురహెమాన్‌,సతీష్‌, శ్రీనివాస్‌, రమేష్‌, రాజు, ప్రకాష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-15T03:55:35+05:30 IST