ఘనంగా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ వేడుకలు

ABN , First Publish Date - 2022-08-14T06:09:27+05:30 IST

ఆజాదీ కా అమృతోత్సవాల సంద ర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు మూడు రోజుల పాటూ ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం నగరంలో పలు విద్యాసంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఘనంగా ఆరంభించాయి.

ఘనంగా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ వేడుకలు

కర్నూలు(కల్చరల్‌), ఆగస్టు 13: ఆజాదీ కా అమృతోత్సవాల సంద ర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు మూడు రోజుల పాటూ ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం నగరంలో పలు విద్యాసంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఘనంగా ఆరంభించాయి. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాలను చేపట్టుకొని విద్యార్థి లోకం దేశభక్తి భావనతో నగరంలో ఊరేగింపు నిర్వహించారు.

 ఆజాదీకా అమృతోత్సవంలో భాగంగా శనివారం జి.పుల్లారెడ్డి ఇంజ నీరింగ్‌ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ర్యాలీని నిర్వహించారు. సుమారు వెయ్యి మంది విద్యార్థులు వంద మీటర్ల భారీ జాతీయ జెండాతో నగరంలో కలెక్టరేట్‌ నుంచి కొండారెడ్డి బురుజు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు వీర శివాజీ, వీరపాండ్య కట్టబ్రహ్మన, అల్లూరి సీతారా మరాజు, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, ఝాన్సీ లక్ష్మిబాయి, రుద్రమదేవి, రాణీ చెన్నమ్మ, భరత మాత వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఆజాదీ కా అమృతోత్సవాల్లో భాగంగా శనివారం నగరంలోని కేవీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల్లో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఇందిరాశాంతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు జాతీయ పతాకాలను ఎగురవే శారు.

 రాయలసీమ ఫిట్‌నెస్‌ అండ్‌ సెల్ఫ్‌డిఫెన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిడ్స్‌ వరల్డ్‌ నుంచీ కొండారెడ్డి బురుజు వరకు మార్షల్‌ ఆర్ట్స్‌ క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు. కొండారెడ్డి బురుజు వద్ద జాతీయ పతాకాలు ఎగురవేసి, స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నిర్వాహక సంస్థ ఫౌండర్‌ ఎస్‌ సతీష్‌కుమార్‌, అకాడమీ మాస్టర్లు భాస్కర్‌, భేరి రవి, కామార్తి భరత్‌, రఘు, ప్రసన్న, గ్రాండ్‌ మాస్టర్‌ ఆరిఫ్‌ హుస్సేన్‌, యోగా అసోసియేషన్‌ కార్యదర్శి అవినాశ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.


కర్నూలు(అర్బన్‌): దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహిద్దామని రాయలసీమ ఫిట్‌ నెస్‌ అండ్‌ సెల్ప్‌ డిఫెన్స్‌ అకాడమీ ఫౌండర్‌ సతీష్‌ కుమార్‌ అన్నారు. శనివారం నగరంలోని కిడ్స్‌ వరల్డ్‌ నుంచి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి సర్కిల్‌ మీదుగా కొండారెడ్డి బురుజు వరకు కొనసాగిన ర్యాలీని జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ సభ్యుడు ఊట్ల రమేష్‌ ప్రారంభిం చారు. కార్యక్రమంలో న్యాయవాది రివికుమార్‌, మాస్టర్‌ భాస్కర్‌, భేరి రవి, రఘు, ప్రసన్న, అనినాష్‌  పాల్గొన్నారు.

ఉర్దూ వర్సిటిలో.. డాక్టర్‌ ఆబ్దుల్‌ హాక్‌ ఉర్దూ యూనివర్సిటీలో అజాదీకా అమృత్‌ మహోత్సవం ఎన్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రిజి స్ట్రార్‌ ప్రొఫెసర్‌ బాయినేని శ్రీనివాసులు మాట్లాడుతూ తిరంగా విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు యూనివర్సిటీపై జాతీయ జెండాను ఎగుర వేశారు. కార్యకమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయ కర్త డాక్టర్‌ ఎస్‌ఎస్‌ఎం హుస్సేనీ, విద్యార్థులు పాల్గొన్నారు.

సిల్వర్‌ జూబ్లీ కళాశాలలో.. స్థానిక సిల్వర్‌ జూబ్లీ కళాశాలలో అజాదీకా అమృత్‌ మహోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డా. వీవీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ హర్‌ ఘర్‌ తిరంగ్‌పై విద్యార్థులు, ప్రజల్లో పెద్దఎత్తున ఆవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ డా. ఎం ఫామిద బేగం, మెహన్‌ నాయక్‌, డా. కళ్యాణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.


కర్నూలు(ఎడ్యుకేషన్‌): ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా శనివారం స్థానిక మాధవనగర్‌లోని నారాయణ పాఠశాలలో జాతీయ జెండాను ప్రదర్శించారు. ప్రిన్సిపల్‌ ఆల్తాఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని ఆర్‌ఐ దుర్గాలక్ష్మి, కోఆర్డినేటర్‌ అరుణ, రెహానా చేతుల మీదుగా 120 అడుగుల జాతీయ జెండా ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు జాతీయ జెండాను చేతపట్టుకుని వివిధ స్వాతంత్య్ర సమరయోధుల వేషధార ణలో పాఠశాల నుంచి సీ.క్యాంపు వరకు ర్యాలీ నిర్వహించా రు. కార్యక్ర మంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వెయ్యి అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ

కర్నూలు(కల్చరల్‌): ఆజాదీ కా అమృతోత్సవాల్లో భాగంగా శని వారం నగరంలోని శ్రీసాయికృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన భారీ ర్యాలీ నగరవా సులను ఆకట్టుకుంది. వెయ్యి అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కళాశాల యాజ మాన్యం పచ్చజెండా ఊపి వెయ్యి అడుగుల జాతీయ జెండాను ప్రారంభించింది. శ్రీసాయి కృష్ణ కళాశాల నుంచి మదర్‌ థెరిస్సా డిగ్రీ కళాశాల ఏ క్యాంపు, కలెక్టరేట్‌ మీదుగా రాజ్‌ విహార్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్ర మంలో కళాశాల డైరెక్టర్లు గోవర్థన్‌రెడ్డి, రోషిరెడ్డి, వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాళ్లు జానీబాషా, సుందర్‌రాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-14T06:09:27+05:30 IST