Advertisement
Advertisement
Abn logo
Advertisement

9 Years చిన్నారిపై తాత లైంగిక దాడి

హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల : జీడిమెట్ల పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలోని చింతల్‌లో తొమ్మిదేళ్ల బాలికపై సొంత తాత లైంగిక దాడికి పాల్పడినట్టు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సోచట్టం కింద కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చింతల్‌లో ఓ వృద్ధుడు(65) నివాసముంటున్నాడు. కొడుకు కూతురు (9ఏళ్లు) నాల్గోతరగతి చదువుతోంది. చిన్నారిపై వారం రోజులుగా తాత లైంగిక దాడికి పాల్పడినట్టు పాపతల్లి చెప్పింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షలకు పంపించామని రిపోర్టులో లైంగికదాడి జరగలేదని తేలిందని సీఐ బాలరాజు తెలిపారు. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తిగొడవలు కూడా ఉన్నాయని ఈకోణంలో కూడా కేసు విచారణ కొనసాగుతోందని తెలిపారు.

Advertisement
Advertisement