వైభవంగా శరన్నవరాత్రుల ఊరేగింపులు

ABN , First Publish Date - 2021-10-17T07:01:53+05:30 IST

అమలాపురంలో జరిగే శరన్నవరాత్రులకు రాష్ట్రంలోనే ఓ ప్ర త్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి దసరా ఉత్సవాలకు 186 ఏళ్లకుపైబడి చరిత్ర ఉంది. వంశపారంపర్యంగా పట్టణ పురవీధుల్లో వివిధ ప్రాంతాలవారు విజయదశమి పర్వదినాలను పురస్కరిం చుకుని భారీ ఊరేగింపులు నిర్వహించారు.

వైభవంగా శరన్నవరాత్రుల ఊరేగింపులు
అమలాపురం పట్టణంలో ఊరేగింపులో శక్తివేషం

 ప్రత్యేక ఆకర్షణగా చెడీ తాలింఖానా..  

కొవిడ్‌ ఆంక్షలతో వీధులకే పరిమితమైన ఊరేగింపులు

(అమలాపురం- ఆంధ్రజ్యోతి)

అమలాపురంలో జరిగే శరన్నవరాత్రులకు రాష్ట్రంలోనే ఓ ప్ర త్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి దసరా ఉత్సవాలకు 186 ఏళ్లకుపైబడి చరిత్ర ఉంది. వంశపారంపర్యంగా పట్టణ పురవీధుల్లో వివిధ ప్రాంతాలవారు విజయదశమి పర్వదినాలను పురస్కరిం చుకుని భారీ ఊరేగింపులు నిర్వహించారు. ఈ ఊరేగింపులో ప్రాచీన సంస్కృతి, సంప్ర దాయాలను ప్రతిబింబింపచేసే చెడీతాలిం ఖానా ప్రత్యేకాకర్షణగా నిలిచింది. పురవీధు ల్లోని ఉత్సవ కమిటీలు ఆయా వీధుల్లో ప్రసి ద్ధి చెందిన వాహనాల్లో దేవతామూర్తులను అలంక రించి శనివారంరాత్రినుంచి అర్ధరాత్రి వరకు ఊరేగించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, బ్యాండు మేళాలు, గారడీలు, కోయ, పూణె నృత్యకళాకారుల విన్యాసాలు, శక్తివేషా లు వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ప్రత్యేక ఆకర్షణగా చెడీ తాలింఖానా

వివిధ పురవీధుల్లో శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా శనివారం రాత్రి భారీఊరేగింపులు నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలతో పోలీసులు విధించిన ఆంక్షల నడుమ ఆయా వీధుల్లో జరిగే ఊరేగింపులకు పరిమితులు విధించారు. దీంతో ఉత్సవాలు వీధులకే పరిమితమయ్యాయి. కొన్ని వీధుల్లో వాహనాలపై అమ్మవార్ల ప్రతిమలను ఉంచి ఊరేగించగా మరికొన్ని వీధుల్లో వీరత్వానికి ప్రతీకగా నిలిచే చెడీ తాలింఖానాలు నిర్వహించారు. పట్టణంలోని కొంకాపల్లి హంస, ఏనుగు వాహనం, మహీపాల వీధి హంసవాహనం, నల్లావీధి విజయదుర్గమ్మ వాహనం, గండువీధి శేషశయన వాహనం, రవణంవీధి మహిషాసురమర్దిని వాహనం, రవణం మల్లయ్య వీధి గరుడ వాహనం, శ్రీరామపురం ఏనుగు వాహనాలతో ఆయా వీధుల్లో ఈ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. కర్రలు, కత్తులు, పటాకత్తులు, బళ్లాలు, లేడి కొమ్ములు, అగ్గి బరాటాలు వంటి వాటితో ఒళ్లు గగుర్పాటు కలిగించే విన్యాసాలను చెడీ తాలింఖానాలో నిర్వహించారు. మహిపాల వీధి, కొంకాపల్లి, గండువీధులు ఈ కార్యక్రమానికి ప్రత్యేక వేదికలయ్యాయి. ఇందులో కళ్లకు గంతలు కట్టుకుని పొట్టలపై కూరగాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు వంటివి కత్తులతో ఒక్క వేటుకు నరకడం ప్రత్యేక ఆకర్షణ. 

పోలీసుల ఆధ్వర్యంలో భారీ భద్రత

శరన్నవరాత్రుల ఊరేగింపునకు అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి, పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ ఆధ్వర్యంలో భారీభద్రత చర్యలు చేపట్టారు. అధికసంఖ్యలో పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఉత్సవాలను ప్రశాంతం గా నిర్వహించారు. పట్టణంలో పోలీసు అధికారులు, సిబ్బంది పురవీధుల్లో భారీకవాతు నిర్వహించారు. ఎక్కడికక్క డే నిఘా కెమెరాలు ఏర్పాటుచేశారు. గడియారస్తంభం సెంటర్‌లో ఎల్‌ఈడీ స్ర్కీన్‌ ఏర్పాటుచేసి పట్టణంలో అన్ని ప్రాంతాల్లో జరిగే ఉత్సవాలవేడుకల పరిస్థితిని పోలీసులు సమీక్షిస్తున్నారు.





Updated Date - 2021-10-17T07:01:53+05:30 IST